తాడిపత్రిలో హై టెన్షన్ లోకేష్ కు పోలీసులు భారీ షాక్

ప్రస్తుతం నారా లోకేష్ పాదయాత్ర తాడిపత్రి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. నారా లోకేష్ పాదయాత్రతో తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఇది జేసీ బ్రదర్స్ నియోజకవర్గం కావడం, అదీకాక గత రెండ్రోజుల నుంచి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న రీతిలో ఇక్కడ వ్యవహారం కొనసాగుతోంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ల మధ్య సవాళ్ళ పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాడిపత్రి డీఎస్పీ చైతన్య నారా లోకేష్‌కు నోటీసులు జారీ చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి శాంతిభద్రతలకు విఘాతం కల్పించొద్దని పోలీసులు హితవు పలికారు. నారా లోకేష్ కు నోటీసులు అందజేసేందుకు వెళ్లిన డీఎస్పీ చైతన్య వెళ్లగా.. నోటీసులు తీసుకునేందుకు నారా లోకేష్ నిరాకరించారు. నోటీసులు తీసుకునేందుకు లోకేష్ తిరస్కరించడంతో యాడికి టీడీపీ మండల కన్వీనర్ రుద్రమనాయుడుకి నోటీసులు అందజేశారు పోలీసులు.

తాడిపత్రి నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్రతో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మూడు రోజుల పాటు యువగళం జరగనుండటంతో.. ముందస్తు జాగ్రత్తగా పోలీసుల్ని మోహరించారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదంటున్నారు. ఆధారాలు లేకుండా మాట్లాడితే పాదయాత్ర వద్దకు వచ్చి లోకేష్‌ను నిలదీస్తాను అన్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి వ్యాఖ్యలతో తాడిపత్రి నియోజకవర్గంలో హైఅలర్ట్ ప్రకటించారు. ఒకవేళ లోకేష్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే.. కఠిన చర్యలు తీసుకోవడానికైనా వెనకాడబోమని పోలీసులు అంటున్నారు. మరి లోకేష్ సైలెంట్ గా ఉండి.. పాదయాత్రకు అడ్డంకులు లేకుండా వ్యవహరిస్తారో..? లేక నోరు జారీ కొత్త చిక్కులు తెచ్చుకుంటారో చూడాలి.