విజయసాయిరెడ్డి పాత్ర కేంద్రంలో అనూహ్యంగా పెరిగింది. తాజాగా ఆయనను కీలకమైన పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ సభ్యుడిగా నియమించారు. ఇప్పటి వరకు ఆయన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఇప్పుడు పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ సభ్యుడిగా నామినేట్ అయ్యారు. ఈ మేరకు రాజ్యసభ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ప్రస్తుతం సాయిరెడ్డి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రాజ్యసభ సభ్యుడిగా రెండు స్టాండింగ్ కమిటీలకూ ఛైర్మన్గానూ ఉన్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ట్రాన్స్పోర్ట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ టూరిజం అండ్ కల్చర్కు ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. నేడు పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎన్నికలు జరిగాయి. ఈ రెండు కమిటీల్లో ఇద్దరు తెలుగు ఎంపీలకు చోటు దక్కింది. ఈ ఏడాది మే ఒకటవ తేదీ నుండి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వ తేదీ వరకు రెండు కమిటీలు మనుగడలో ఉంటాయి. పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీలో విజయసాయిరెడ్డి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ చోటు దక్కించుకున్నారు.