కోటంరెడ్డిని బండికి కట్టి ఈడ్చుకెళ్తా…దమ్ముంటే 51 సెకన్ల ఆడియో క్లిప్పింగ్ రిలీజ్ చెయ్

1.సీఎం జగన్ అధ్యక్షతన ఎస్ఐపీసీ భేటీ..
పలు భారీ పరిశ్రమల ప్రతిపాదనకు ఆమోదం.

2. దళితుల గురించి మాట్లాడే అర్హత నారా లోకేష్ కి లేదు..
సబ్ ప్లాన్ అంటే అసలు లోకేష్ కు తెలుసా? అంటూ మంత్రి మేరుగ నాగార్జున ప్రశ్న.

3.కందుకూరు తొక్కిసలాట ఘటనను జస్టిస్ శేషశయనారెడ్డి కమిషన్ విచారణ..
ఈ విచారణకు తాడికొడ మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ హాజరు.

4. ఎమ్మెల్యే కోటంరెడ్డి కి భారీ ఝలక్ ..
నియోజకవర్గ కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో మెంబర్లు, వైఎస్సార్సీపీ ఎంపీ, ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దతు

5.కోటంరెడ్డి నుంచి నాకు ప్రాణహాని ఉంది..
అనిల్ కార్యాలయాన్ని తగులబెట్టిన దుండగులు..కోటంరెడ్డిని వాహనానికి కట్టి ఈడ్చుకెళ్తానన్న అనిల్

6.చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే మునిరామయ్య
గతంలో టీడీపీ నుంచి కాంగ్రెస్ కి వెళ్లిన మునిరామయ్య.

7.హరీశ్ రావు కొత్త సీసా తీసుకెళితే కేసీఆర్ పాత సారా పోశారని.. తెలంగాణ బడ్జెట్ పై షర్మిల వ్యంగ్యం
మొదటి నుంచి తెలంగాణకు వైఎస్ కుటుంబం వ్యతిరేకమని కడియం శ్రీహరి వ్యాఖ్య.

8.భద్రత తొలగింపుపై హైకోర్టును ఆశ్రయించిన పయ్యావుల కేశవ్..
ఫోన్ ట్యాపింగ్ పై తాను మాట్లాడినందు వల్లే భద్రత తొలగించారని పయ్యావుల తన పిటిషన్ లో ఆరోపణ.

9.నీకు ధైర్యం ఉంటే మిగతా 51 సెకన్ల ఆడియో క్లిప్పింగ్ రిలీజ్ చెయ్..
కోటంరెడ్డికి అనిల్ కుమార్ యాదవ్ సవాల్

10.సీఎం జగన్ ను కొత్త పేరుతో సంబోధించిన పవన్ కల్యాణ్
అప్పురత్న జగన్ అంటూ ఎద్దేవా