1.అకాల వర్షాలతో తడిసిన, మొలకెత్తిన, తేమ శాతం అధికంగా ఉన్న ధాన్యం కొనుగోలు విషయంలో ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదు..
అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు.
2.నేటి నుండి అందుబాటులోకి రానున్న ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమ౦..
లాంఛనంగా ప్రారంభించనున్న cm జగన్.
3.తనకు రామోజీరావుతో ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవు.. అక్రమాలని మాత్రమే ప్రశ్నిస్తున్నా..
‘రామోజీరావు సంస్థల చరిత్ర మొత్తం నా దగ్గర ఉందని ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు.
4.ఈ నెల 11న విశాఖ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్..
పీఎం పాలెం క్రికెట్ స్టేడియంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం.
5.ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్, సౌత్ లాబీ పదాలు వాడకుండా నిషేధించాలంటూ సుప్రీంలో పిటిషన్
సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి పిటిషన్ ధాఖలు.
6.1,650 మంది ఉపాధ్యాయులపై ఏపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి..
ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం సరికాదని బొప్పరాజు వ్యాఖ్య
7.ఆర్థికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేస్తోంది..:
అత్యధిక తలసరి ఆదాయాన్ని సాధించడంలో ఏపీ ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోటీ పడుతోందని ఏంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్య.
8.విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ రాఘవరావు సస్పెండ్ ..
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇటీవల అరెస్ట్.
9. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూడలేక టీడీపీ, వారి మీడియా విషం కక్కుతోంది..
వారి బాధ చూస్తుంటే జాలి వేస్తోంది అంటూ తెలుగుదేశం పార్టీ నేతలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు.
10.ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించి తప్పు చేశా౦..
వనంత కృష్ణ ప్రసాద్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఇబ్రహీంపట్నం గ్రామీణ మండలం దామలూరు కౌలు రైతు.