సిఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ నేత ఆదినారాయణరెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. ఆదినారాయణరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ పులిపాటి ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. తుళ్లూరు పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ నేత సత్యకుమార్ వాహనంపై దాడి ఘటనపై స్పందించారు. గుర్తు తెలియని వ్యక్తి సత్యకుమార్ వాహనంపై రాసి విసిరాడని, ఆ తర్వాత పొలాల్లోకి పారిపోయాడని వెల్లడించారు. ఇక, తమపై ఆదినారాయణరెడ్డి అనుచరులు దాడి చేశారంటూ మూడు రాజధానుల ఆందోళనకారులు ఫిర్యాదు చేశారని తెలిపిన ఆయన.. ఈ ఘటనపై దర్యాప్తు చేయనున్నట్టు పేర్కొన్నారు.
నిన్నటి వేళ అమరావతి ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ నేత సత్యకుమార్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.. ఈ రోజు ఆందోళన, నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి.. ఇక, ఈ ఘటనపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సీరియస్ స్పందించారు.. పథకం ప్రకారమే తనపై దాడి జరిగిందన్నారు.. తమ కార్లపై పెద్ద పెద్ద రాళ్లతో దాడులు చేశారని.. మా కార్యకర్తలను వెంటబడి కొట్టారని అన్నారు..