1.వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కుపై సిఎం జగన్ సమీక్ష..
జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని సీఎం స్పష్టం.
2.వీధికుక్కల ప్రచారం పట్టించుకోను.. సీఎం జగన్ వెంటే నా ప్రయాణ౦..
అసంతృప్తితో పార్టీ మారబోతున్నారంటూ వస్తున్న ప్రచారంపై తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్.
3.పదవి నుంచి తొలగిస్తారన్న దానిపై నాకు సమాచారం లేదు..
అసలు తనకు సీఎంఓ నుంచి ఎలాంటి పిలుపు రాలేదని మంత్రి సీదిరి అప్పలరాజు క్లారిటీ.
4.ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి తీవ్ర అస్వస్థత..
మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలింపు.
5.పార్టీ లైన్ దాటితే ఎవరికైనా అటువంటి పరిస్థితి తప్పదు..
ఉండవల్లి శ్రీదేవి తప్పు చేశారు కాబట్టే ఎన్నికల ప్రచార రాధాన్ని వైసీపీ కార్యకర్తలు తీసుకెళ్లారని మంత్రి మెరుగు నాగార్జున స్పష్టం.
6.దాడులు చేయించడం మా సంస్కృతి కాదు..
బీజేపీ నేత సత్యకుమార్ దాడిపై సజ్జల.
7.వైసీపీ గూండాలు దాడి చేస్తుంటే పోలీసులు ఏంచేస్తున్నారు..
సత్యకుమార్ కారుపై రాళ్ల దాడిని ఖండించిన చంద్రబాబు.
8.ఇచ్చేది చాక్లెట్… ఎత్తుకెళ్లేది నక్లెస్.. జగన్ సంక్షేమమంతా బూటకం..
రాష్ట్ర భవిష్యత్తును కట్ట కట్టి కృష్ణాలో పారేశారని కన్నా లక్ష్మీనారాయణ మండిపాటు.
9.ఏపీలో ఇసుకాసురా వైభవము.. ఇసుకను ఇష్టానుసారంగా అమ్ముకుంటూ, దోచుకుంటున్నారు..
ఇసుక దోచుకో, అమ్ముకో అనే విధంగా ఉందని రఘురామ కృష్ణంరాజు
10. సీబీఐ కోర్టులో సునీత ఇంప్లీడ్ పిటిషన్…
తదుపరి విచారణను సీబీఐ కోర్టు వచ్చే నెల 28కి వాయిదా.