చంద్రబాబు ఆవేశంలో ఊగిపోతున్నారు. మామూలుగా ఊగిపోవడం కాదు. రాజకీయాలలో విలువలను దిగజారుస్తూ..తమ కార్యకర్తల్ని రెచ్చగొట్టేలా నాలుక చరుస్తూ నోటికి ఎంతోస్తే అంత అనేస్తున్నారు. ఈ వయసులో ఆయనకి ఇలాంటి రాజకీయాలు అవసరమా..? అధికారం కోసం ప్రజల్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలు రాజకీయాలు చేయడం ఏంటి బాబు.నిన్న మేడికొండూరులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వింటే.. రాజ్యాధికారం కోసం ఆయన సృష్టిస్తున్న రణం ఏంటో మీకే అర్ధంఅవుతుంది. ఏమన్నావు చంద్రబాబు గుంటూరులో ఒక్క సీటు వైసీపీ గెలుచుకుందంటే ప్రజల మెడకు ప్రజలే ఉరితాడు వేసుకున్నట్టా..? అంటే నీ రాజకీయ భవిష్యత్ కోసం, ఇంకా రాజకీయ ఓనమాలు కూడా నేర్చుకోని నీ సుపుత్రుడి కోసం.. అమాయక ప్రజల్ని ఊరి తీస్తావా బాబు. రోడ్ షోల పేరుతో తమరు చేసేది రాజకీయమా.. లేక యుద్ద రణరంగమా. భావి తరాల భవిష్యత్ ని తాకట్టు పెట్టింది ఎవరు బాబు. నాడు బాబు వస్తే జాబిస్తా అని చెప్పి.. నీ పుత్రుడికి పోస్ట్ ఇచ్చి.. రాష్ట్రంలో ఒక్క నిరుద్యోగికి కూడా జాబు ఇవ్వకుండా ఉసరవల్లిలా రంగులు మార్చింది ఎవరు బాబు. ఏపీలో వచ్చేది మా రాజ్యమే.. మేము అధికారంలోకి రాగానే వైసీపీని చీల్చి చెండాడుతాం, అన్నీ వడ్డీతో సహాచెల్లిస్తామని ఊగిపోతున్న చంద్రబాబు తమరు కాస్త తగ్గాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసింది ఏంటి..? అసలు నీ ఎన్నికల మ్యానిఫెస్టో ఎక్కడుంది..? తమరు ఇచ్చిన 600 హామీలు ఏమయ్యాయి…? ఇలా కొన్ని వందల ప్రశ్నలకు తమరు జవాబు చెప్పాలి.. బాబు. మీ పాలన నచ్చకే కదా.. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలయ్యింది. ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై ఇప్పుడు నీ ఆరోపణలు ఏంటి బాబు..? నువ్వు ఎన్ని కల్లబొల్లి కబుర్లు చెప్పినా జనం నీ మాటను లెక్కచేసే రోజులి పోయాయి బాబు. ఎందుకంటే ప్రస్తుతం ఏపీలో రాజన్న రాజ్యంతో ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు.