కామెడీ పీస్ అయిన చంద్రబాబు పవన్ కి చెక్ పెట్టిన జగన్

ఏపీలో టోటల్ గా ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. ఎన్నికలు నేడో రేపో అన్న విధంగా.. అన్ని పార్టీల నాయకులు చావో రేవో అంటూ ప్రచారాలు మొదలెట్టేశారు. ఓ వైపు సిఎం జగన్.. మరో వైపు.. చంద్రబాబు, లోకేష్ , పవన్ కళ్యాణ్ .. అవసరమైతే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఏకం అయ్యే ఛాన్స్ లేకపోలేదు. మళ్ళీ వైఎస్ జగన్ సింగిల్ గానే భరిలోకి దిగుతున్నారు. కానీ ఈ తోడేళ్ల గుంప౦తా కలసికట్టుగా దాడి చేయబోతున్నాయి. అయినా డోంట్ కేర్ అంటూ.. ప్రతిపక్షాలకు సవాళ్ళ మీద సవాళ్ళు చేస్తూ.. వారికి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే.. గత ఏడాది నుంచి చంద్రబాబు పాడిందే పాట పాడుతూ.. తెగ కామెడీ చేస్తున్నారనుకోండి. రాష్ట్రాన్ని పాలించడం ఈ ముఖ్యమంత్రికి వల్ల కావట్లేదాని.. డబ్బులు పంచడానికి జగన్ రెడ్డి వద్ద నిధులు లేవని.. అందుకే.. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని చంద్రబాబు తెగ కామెడీ చేశారు. ఇంకేముంది ముందస్తు ఎన్నికల కోసమే జగన్ ఢిల్లీ టూర్ వెళ్లారని కూడా ప్రచారం చేశారు. ఇక జూన్ 7 న జరగబోయే క్యాబినెట్ మీటింగ్ లో దీనిపై స్పష్టత రానుందని కూడా ప్రచారం చేశారు. కానీ తాజాగా జరిగిన క్యాబినెట్ భేటీలో ముందస్తు ఎన్నికల గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదు. ఇక దీనిపై ఎల్లో మీడియా కూడా డిబేట్ ల మీద డిబేట్ లు పెట్టి నానా యాగీ చేసింది. ఎట్టకేలకే.. తాజాగా జరిగిన క్యాబినెట్ భేటీ ఈ ప్రచారాలకు చెక్ పెట్టినట్టయ్యింది. మరి దీనిని బట్టి చూస్తే.. ఎవరు బయపడుతున్నారనేది చాలా క్లియర్ గా అర్ధమవుతోంది. ముందస్తు ఎన్నికల౦టూ.. తమ పార్టీ క్యాడర్ ను ఉత్సాహ పరచడం కోసం, అందునా.. పార్టీ నాయకులను అలర్ట్ చేయడం కోసమే చంద్రబాబు ఇలాంటి కామెడీ వ్యాఖ్యలు చేశారని రాజకీయ నిపుణులు అంటున్నమాట. ఇక పొత్తుల గురించి త్వరగా ఓ నిర్ణయం తీసుకోవడం కోసం ఈ హడావిడి చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. పవన్ అంటున్నట్టుగా ఓట్లు చీల్చడం అంత ఈజీ కాదని లక్ష్మీ పార్వతి తమ తేల్చి చెప్పారు. నాయకుడి విధానాలు అర్ధం కాక జనసేన కార్యకర్తలు అయోమయంలో ఉన్నారన్నారు. .