నిన్నటి వరకు సినిమా షూటింగ్ లో బిజీగా ఉండి.. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను పరమర్శించడానికి ఏపీకి వచ్చిన పవన్ కళ్యాణ్ కి సిఎం జగన్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. మంత్రి అంబటి రాంబాబుకి, పవన్ కళ్యాణ్ కి మద్య పచ్చ గడ్డి వేస్తే బగ్గుమంటుంది. వచ్చే ఎన్నికల్లో అంబటి రాంబాబుని ఓడించాలని, సత్తెనపల్లిలో జనసేన జెండా ఎగరవేయాలని పవన్ కళ్యాణ్ ఎన్నో కలలు కంటున్నారు. అయితే.. పవన్ కళ్యాణ్ చేసే వీకెండ్ రాజకీయాల వల్ల పార్టీలో ఉన్న నాయకులు పార్టీని వీడే పరిస్థితి వచ్చింది. గతంలో సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన సీనియర్ నేత యర్రం వెంకటేశ్వర రెడ్డి ఈ రోజు సిఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. దీంతో సత్తెనపల్లిలో జనసేన బలమైన నాయకుడిని కోల్పోయింది.