సీఎం జగన్ మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. హిందూ దేవాలయాల పాలకమండలిలో నాయీ బ్రాహ్మణులకు బోర్డు మెంబర్లుగా శాశ్వత అవకాశం కల్పించారు. ఈ సందర్బంగా సీఎం జగన్ చిత్ర పటానికి నాయీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు , డైరెక్టర్ మల్కాపురం కనకారావు గారి ఆధ్వర్యంలో గుణదలలోని రాష్ట్ర కార్యాలయంలో పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. సీఎం జగన్ ప్రతి ఒక్క సామాజిక వర్గానికి సమాన్యాయం చేకూరుస్తున్నారని ఈ సందర్బంగా నాయీ బ్రాహ్మణులు తమ అభిప్రాయ వ్యక్తం చేశారు.