తునిలో టీడీపీ తునాతునకలు జగన్ దెబ్బకి జనసేన తుస్

ఆ నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం కంచుకోట. ఇప్పుడు అధికార వైసీపీకి అడ్డాగా మారిపోయింది. వరుసగా రెండుసార్లు విజయం
సాధించిన వైసీపీ.. మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని గట్టిగా ట్రై చేస్తోంది. మరి అది సాధ్యమయ్యే పనేనా..? అసలు ఏంటి ఆ
నియోజకవర్గం. అదే తుని నియోజకవర్గం. 2014 ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తెలుగుదేశం హవా కొనసాగినప్పటికీ.. తునిలో దాడిశెట్టి రాజా
విజయం సాధించి టీడీపీ కంచుకోటను బద్దలుకొట్టారు. 2014లో గెలిచినా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండటంతో.. అభివృద్ధి చేసేందుకు అవకాశం
లేదని.. మరోసారి చాన్స్ ఇవ్వాలంటూ జనంలోకి వెళ్లి.. గెలిచారు. ఇప్పుడు ఆయన జగన్ కేబినెట్‌లో మంత్రిగానూ ఛాన్స్ కొట్టేశారు. ఆయన
ఎమ్మెల్యేగా ఎన్నికైన దగ్గర్నుంచి.. నియోజకవర్గంలో తన క్యాడర్‌ని, బలాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. జగన్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక.. జగన్ సర్వేలోనూ.. మంత్రి రాజాకు మంచి మార్కులే పడినట్లు
తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లోనూ.. ఆయనకే టికెట్ కన్ఫామ్ అనే టాక్ వినిపిస్తోంది. ముచ్చటగా మూడోసారి కూడా విజయం సాధిస్తారని..
కార్యకర్తలు అంటున్నారు. ఇక.. దాడిశెట్టి రాజా తన సొంత క్యాడర్‌లోని మోతుకూరు వెంకటేశ్ అనే వ్యక్తి.. అవినీతికి పాల్పడ్డారని.. అందరికీ చెప్పి
అతన్ని దూరం పెట్టారు. సొంత వాళ్లు తప్పు చేసినా ఊరుకునేది లేదని.. అది తమ ప్రభుత్వం తీరని.. జనంలోకి ఓ ప్రచారాన్ని వదిలారు.
మరోవైపు టి‌డి‌పి కూడా తన బలాన్ని నిరూపించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తోందీ.

జనసేన విషయానికొస్తే.. గత ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు పోటీ చేశారు. ఆయనకు.. స్వల్ప ఓట్లు మాత్రమే
వచ్చాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత.. రాజా అశోక్ బాబు పెద్దగా ప్రజల్లోనూ, పార్టీ కార్యక్రమాల్లోనూ కనిపించిన దాఖలాల్లేవు. అశోక్ బాబు..
ఇటీవలే జనసేనను వీడి తెలుగుదేశం అధినేత చంద్రబాబుని కలిశారు. ఆ తర్వాత కూడా ఆయన జనంలో పెద్దగా కనిపించలేదు. తునిలో ఆఖరి
కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసిన రాజ అశోక్ బాబుకి సొంతంగా క్యాడర్ ఉన్నా.. పాలిటిక్స్‌కి మాత్రం దూరంగా ఉంటున్నారు. దాంతో.. ప్రస్తుతం
నియోజకవర్గంలో జనసేనకు ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఉన్నా.. నడిపించే నాయకుడే లేడు. దాంతో.. తుని ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ
చేసినా.. విడివిడిగా పోటీ చేసినా.. పెద్దగా ప్రభావం ఉండదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. అంతేకాదు.. మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు..
ఎన్నికల నాటికి ఏ పార్టీ ఉంటారన్నది కూడా ఆసక్తిగా మారింది. దాంతో.. తునిలో టీడీపీ, వైసీపీ మధ్య నువ్వా-నేనా అనే స్థాయిలోనే పోటీ
ఉంటుందనే చర్చ జరుగుతోంది