అనంతపురం జిల్లా తాడిపత్రిలో పొలిటికల్ హీట్ మరింత రాజుకుంది. తాడిపత్రిలో స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ కుటుంబానికి మధ్య రాజకీయ విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. ఎమ్మెల్యే పెద్దారెడ్డి పై జేసీ ప్రభాకర్ రెడ్డి నిత్యం ఏదో ఒక ఆరోపణ, విమర్శలు చేస్తూనే వస్తున్నారు. తన నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమాస్యను తానే దగ్గరుండి మరీ పరిష్కరిస్తుంటే.. ఎమ్మెల్యే పెద్దారెడ్డి పైజేసీ ప్రభాకర్ రెడ్డి లేనిపోని నిందలు వేయడమే పనిగా పెట్టుకున్నారనిపిస్తోంది. తాజాగా జేసీ కుటుంబానికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సవాల్ విసిరారు. జగన్ సీఎం అయ్యాక.. తాడిపత్రి నియోజకవర్గంలో డ్యామ్‌లను నింపి రెండు పంటలకు నీళ్లు అందిస్తున్నామన్నారు. కానీ.. గత 35 ఏళ్లలో జేసీ కుటుంబం ఏనాడూ ఇలాంటి పనులు చేయలేదంటూ కేతిరెడ్డి దుయ్యబట్టారు. వాళ్లు ఈ పనిచేసినట్లు నిరూపించగలరా అని ఎమ్మెల్యే సవాల్ విసిరారు.
నియోజకవర్గంలో తాను పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలను పరిస్కరిస్తుంటే కళ్ళు కాకులు ఎత్తుకుపోయాయా అంటూ.. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఓ రేంజ్ లో విరుచుకు పడ్డారు. గతంలో ముఠా కక్షలు, గొడవలు, గ్రామాల్లో ఎక్కడ చూసినా ఫ్యాక్షనిజం ఉండేదని.. ప్రస్తుతం తాడిపత్రి ఎంతో ప్రశాంతంగా వుందని.. దీనికి సీఎం జగనే కారణమని ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రశంసించారు. ఒకప్పుడు తాడిపత్రిలో రౌడీయిజం చేసిన జేసీ.. ఇప్పుడు డ్యాన్సులు వేసుకునే స్థాయికి చేరారంటూ పెద్దారెడ్డి సెటైర్లు వేశారు.