అమరావతిలో చంద్రబాబుకు చుక్కెదురు జేసీ ప్రభాకర్ రెడ్డి హల్చల్ బాబు అవినీతి, మోసాలు బట్టబయలు

1.రాజమహేంద్రవరం మెడికల్ కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్లకు అడ్మిషన్లు ప్రారంభం..
రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం జరుగుతోందని మంత్రి విడదల రజిని వెల్లడి.

2.అమరావతిలో చంద్రబాబుకు చుక్కెదురు..
పెదకూరపాడు నియోజకవర్గం రాకను నిరసిస్తూ అమరావతిలో బాబు అవినీతి, మోసాలపై ప్రజలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు.

3. మన బడి నాడు – నేడు రెండో దశ పనులను జూన్ 12లోగా పూర్తి చేయండి..
జిల్లా విద్యా శాఖ అధికారులకు పాఠశాలల మౌలిక వసతుల కమిషనర్ కాటంనేని భాస్కర్ ఆదేశాలు జారీ.

4. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని మరింత సమర్థంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ద్వారా కార్యక్రమం పర్యవేక్షణ.

5.రబీ ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలి..
ధాన్యం సేకరించిన తర్వాత రైతులకు తప్పనిసరిగా రసీదు అందచేయాలని అధికార యంత్రాంగానికి సిఎం జగన్ ఆదేశ౦.

6.తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మళ్లీ హల్చల్..
మునిసిపల్ అధికారులు తన మాట వినలేదంటూ స్థానిక మునిసిపల్ కార్యాలయంలో వంటా వార్పునకు పిలుపు.

7.మంత్రాలయం నియోజకవర్గంలోకి ప్రవేశించిన లోకేశ్ పాదయాత్ర..
లోకేశ్ కు మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జీ తిక్కారెడ్డి, పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం.

8.వైఎస్ కుటుంబ సభ్యులు సీఎంలు అయితే కాదు.. రాహుల్ ప్రధాని అయితేనే వైఎస్సార్ ఆత్మ సంతోషిస్తుంది..
విజయవాడలో కాంగ్రెస్ ‘జై భారత్ సత్యాగ్రహ బహిరంగ సభ కేవీపీ సంచలన వ్యాఖ్యలు.

9.జగన్ ను కలిసేందుకు మహారాష్ట్ర నుంచి 800 కిమీ సైకిల్ తొక్కుతూ వచ్చిన రైతు..
ఆప్యాయంగా స్వాగతించిన సీఎం జగన్.

10.పొత్తుల గురించి సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారం ఆధారంగా మాట్లాడవద్దు..
ఈ విషయంలో తానే స్వయంగా తీసుకుంటానని జనసేన నాయకులకు పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ.