టీడీపీ సీనియర్లకు జేసీ షాక్. లోకేష్ పాదయాత్రలో పెంట..పెంట

టీడీపీకి కార్యకర్తలు లేక కాదు లీడర్ల లేకపోవడంతోనే.. ఇప్పుడైనా బయటకు రండి.. ఏమవుతుంది కేసులు పెడతారు..అంతకు మించి ఈ ప్రభుత్వం ఎం చేయగలదు అంటూ.. జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న జేసీ.. టీడీపీలో ఉన్న కొందరు సీనియర్ నాయకులు ఇంకా బయటకు రాకుండా దాక్కున్నారని పేర్కొన్నారు. తన మీద 72 కేసులు పెట్టారు ఏమీ కాలేదన్నారు. పోరాడే వారికే టికెట్లు ఇవ్వాలన్నారు. ఎవరైతే లీడర్లు బయటకు రాలేదో వారికి టికెట్లు ఇవ్వొద్దని చంద్రబాబు, లోకేష్‌లకు చెబుతానన్నారు. ఎవరైతే బయటకు రాకుండా ఉన్నారో అలాంటి సీనియర్ల తోకలు కట్ చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ధైర్యం ఉండేవాడికి, కార్యకర్తల్ని కలుపుకుని పోయేవారికి టికెట్ ఇవ్వాలి అన్నారు. అలా చేస్తే 175కు 175 వస్తాయని ధీమాను వ్యక్తం చేశారు. లీడర్లు నియోజకవర్గాల్లో ముందుకొచ్చి ధైర్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. తాను ధైర్యంగా తాడిపత్రిలో ఉత్సవం పెడితే 4వేలమంది వచ్చారన్నారు. ప్రతి నియోజకవర్గానికి ధైర్యం ఉండే లీడర్ కావాలన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా.. పార్టీ కోసం పనిచేస్తానన్నారు.ఈసారి ఎన్నికల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి గురించి అందరికీ తెలిసిన విషయమే.. ఆయన ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తి. ఆయన వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇప్పుడు టిడిపి సీనియర్లకు టికెట్ ఇవ్వొద్దు, వారి తోకలు కట్ చేయాలని అన్న వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.