వాళ్ళకి గట్టిగా వార్ణింగ్ ఇచ్చిన కంగనా…

బాలీవుడ్‌లో అత్యంత ప్రసిద్ధ నటీమణులలో కంగనా రనౌత్ ఒకరు. సినిమాల ద్వారానే కాకుండా వివాదాల ద్వారా కూడా సోషల్ మీడియాలో ఆమె ప్రత్యేకంగా నిలుస్తుంది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాస్పద పాత్రలతో ఫేమస్ అయిన కంగనా రనౌత్ ను ఎవరో టార్గెట్ చేశారు. ఒకరోజు క్రితం సోషల్ మీడియాలో ఈ ప్రకటన చేస్తూ.. తనను ఎవరో వేధిస్తున్నారని వెల్లడించింది. ఈ సమస్య గురించి ఆమె చివరి పోస్ట్ ఒక మహిళతో ఆమె కరచాలనం చేస్తున్న ఫోటో మరియు దానిపై నటి పేరు కనిపిస్తుంది.

తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో ఈ విధంగా రాసకొచ్చింది. నా గురించి ఆందోళన చెందుతున్న వారందరికీ దయచేసి హెచ్చరిక. గత రాత్రి నుంచి నా చుట్టూ ఎటువంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరగలేదు. కెమెరాలతో ఎవరు నన్ను అనుసరించలేదు.. ఆ చాంగు మంగు గ్యాంగు నేను ఒకటే చెబుతున్నాను.. నేను పిచ్చిదాన్ని అని మీరు అనుకుంటే పొరపాటు.. ఇందులో ఎంత పెద్ద వారైనా సరే వదిలే ప్రసక్తే లేదు.. ఇంట్లోకి దూరి మరీ కొడతా అంటూ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చింది కంగనా రనౌత్.

ఇది కాకుండా, బాలీవుడ్ క్యూట్ కపుల్, రణబీర్ కపూర్ అలియా భట్ గురించి వ్యాఖ్యలు చేశారు. కంగనా సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె ఎమర్జెన్సీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషిస్తోంది. రజనీకాంత్ తమిళ చిత్రం చంద్రముఖికి సీక్వెల్ అయిన చంద్రముఖి 2లో కూడా తాను నటించబోతున్నట్లు తెలిపింది.