కన్నా లక్ష్మీ నారాయణ ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యారు. ఆయన ఏ పార్టీలో చెరనున్నారు..? జనసేనానా..? లేక టిడిపి నా..? అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. పది రోజుల క్రితం కన్నా.. టీడీపీ నేతలతో హైదరాబాద్ లో సమావేశం అయ్యారా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. కన్నా లక్ష్మీ నారాయణ టిడిపి లోకి వచ్చేందుకు ఆ పార్టీ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందని అంటున్నారు. తనకు కావాల్సిన హామీ టీడీపీ నుంచి రావడంతో సైకిల్ ఎక్కడమే మేలని ఆయన ఫిక్స్ అయినట్టు ఓ వర్గం చెబుతోంది. ఈ నెల 23 లేద 25 తేదీల్లో ఆయన చంద్రబాబు నాయుడి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నాయి.
వచ్చే ఎన్నికల్లో టిడిపి – జనసేన పొత్తులు పెట్టుకుంటే ఆ రెండు పార్టీలు ఒకటే కదా.. ఇందులో వింత ఏముంది.. ఏ పార్టీ అయితే ఏంటని నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు. కానీ.. ఇప్పటికీ జనసేన పొత్తుపై ఎలాంటి హామీ ఇవ్వడం లేదని.. ఇలాగే ఆలస్యం చేస్తే అనుకున్న సీటు దక్కకపోయే ప్రమాదం ఉందని, అందుకే కన్నా తన ఆలోచన మార్చుకున్నట్టు ఆయన అనుచరులు అంటున్నమాట. ఒకవేళ టీడీపీ, జనసేన పొత్తు లేకుండా.. జనసేనలో చేరితే భారీగా నష్టం తప్పదని ఆయన అభిప్రాయపడుతున్నారంట.. ఎందుకంటే టీడీపీతో జనసేన జత కలవకపోతే.. బీజేపీతో కలిసే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అదే జరిగితే తాను బీజేపీని వీడడంలో అర్థం లేదని.. ఎదో ఒక రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారని ఆయన అనుమానించినట్టు తెలుస్తోంది. అంతేకాదు జనసేన సైతం కన్నాను పార్టీలోకి ఆహ్వానించడంలో కాస్త వెనుకబడినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పొత్తులపై ఇలా నాన్చడం వల్లనే కన్నా టిడిపిలోకి వెళ్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.