బాబు బరతం పట్టిన కొడాలి నాని గుడివాడ నుంచి దెబ్బకు పరార్..

చంద్రబాబు గుడివాడ పర్యటనలో కొడాలి నానిపై సంచలన ఆరోపణలు చేశారు. బాబు ఆరోపణలపై కొడాలి నాని రియాక్ట్ అయ్యారు. మీడియాతో మాట్లాడుతూ.. బాబు బాగోతం అంతా చెప్పుకొచ్చారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు గుడివాడ కు ఏం చేశారు? అని నిలదీశారు.. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలకు మద్దతు పలికిన చంద్రబాబు ఎందుకు ఇక్కడ ఫ్లై ఓవర్లు కట్టలేదో చెప్పాలన్నారు. గుడివాడ ఎన్టీఆర్ పుట్టిన గడ్డ అని చంద్రబాబు ఇప్పుడు దొంగ ప్రేమ చూపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్మకూరు వెళ్తే చంద్రబాబు ఉండటానికి ఎవరూ ఇల్లు కూడా ఇవ్వలేదు.. అందుకే బస్సులో చంద్రబాబు పడుకున్నాడు అంటూ సెటైర్లు వేశారు. పెళ్ళైన 42 ఏళ్లకు అత్తగారు ఇంటికి వెళ్ళి పడుకున్న
చంద్రబాబుకు సిగ్గు ఉందా? అంటూ ఫైర్ అయ్యారు. అసలు నిమ్మకూరులో ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలను కట్టించింది కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు. 2003లో 60 లక్షల రూపాయలు వెచ్చించి.. భూమి కొనుగోలు చేసి ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలు ఏర్పాటు చేశాం అని కొడాలి వెల్లడించారు. అసలు నిమ్మకూరుపై ప్రేమ ఉన్నది ఎన్టీ రామారావు, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్కు మాత్రమే అన్నారు. నిమ్మకూరులో జూనియర్ ఎన్టీఆర్ కు తప్ప ఎవరికీ ఆస్తులు లేవన్నారు. గుడివాడ నియోజక వర్గంలో ఫ్లై ఓవర్లు, రోడ్లు, పేదలకు ఇళ్లను కడుతూ అభివృద్ధి చేస్తున్నాం.. కళ్ళు మూసుకుపోయాయా అంటూ మండిపడ్డారు. అంబేద్కర్ జయంతి రోజున ఇలాంటి దరిద్రుడి గురించి మాట్లాడటం చాలా సిగ్గుచేటుగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ నీచుడు అసలు ఒంటరిగా పోటీ చేసిన సందర్బాలు లేవని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూటముల కోసం ఆరాటపడతాడని కోడాని నాని సెటైర్ వేశారు. సింగిల్ గా వచ్చే దమ్ము లేకనే పొత్తులు పెట్టుకొని పోటీకి దిగుతున్నారని అన్నారు. నువ్వు ఎంత మందితో కలిసొచ్చినా.. జగన్ మోహన్ రెడ్డిని ఎం పీకలేవన్నారు. సిఎం జగన్ ఒక క్రైస్తవుడు అని అవమాన పరిచి.. ఇప్పడు క్రైస్తవులతో ఎందుకు మీటింగ్ పెడుతున్నావని కొడాలి ప్రశ్నించారు. ఓట్ల కోసం బాబు ఎంతకైనా దిగజారుతారని కొడాలి నాని బాబుపై ఓ రేంజ్ లో మండిపడ్డారు.