ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ కట్టుబాటు కాదని టీడీపీకి ఓటేసిన నలుగురు ఎమ్మెల్యేలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. ఎమ్మెల్యేకు కేటాయించిన కోడ్ ఆధారంగా మొదటి ప్రాధాన్యతా, రెండో ప్రాధాన్యతగా వచ్చిన ఓట్లను బట్టి నలుగురు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడట్టు పార్టీ అంచనాకు వచ్చింది. ఈ నేపథ్యంలో వేంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు పార్టీ విప్ ధిక్కరించి టీడీపీకి ఓటేయడాన్ని పార్టీ తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే
కోటంరెడ్డి ఫస్ట్ రియాక్షన్ అయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయన మీద తీసుకున్న చర్యలు సమంజసమేనని కోటంరెడ్డి రియాక్ట్ అయ్యారు. తన నియోజకవర్గంలో ఉన్న ప్రజాసమస్యల మీద తమ పార్టీతో ప్రస్తావించి నాలుగేళ్లుగా విసిగి వేసారి, ఈ రోజు ప్రజయ సమస్యలను ప్రస్తావిస్తే.. దానిని రాజకీయ కోణం కింద చూశారని కోటంరెడ్డి అన్నారు. అయితే ఆ సస్పెన్షన్ చేసిన విధానం మాత్రం నా ఒక్కడికీ జరిగిన నష్టం కాదు, ప్రజాస్వామ్యానికే జరిగిన నష్టం అంటూ కోటంరెడ్డి పేర్కొన్నారు. పార్టీలో ఉన్న ఒక శాసనసభ్యుడిని సస్పెండ్ చేయాలంటే షోకాజ్ నోటీసులు ఇచ్చి,సమయం ఇచ్చి, వ్యక్తి వివరణ తీసుకొని తుది నిర్ణయం తీసుకోవాలని, అలా కాకుండా ఏదో పెత్తందారి రాజకీయాలు చేసిన విధానం మాత్రం కేరెక్ట్ కాదని కోటంరెడ్డి వెల్లడించారు. రేపటి రోజున రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీని రాష్ట్ర ప్రజలు రాజకీయంగా శాశ్వతంగా డిస్మిస్ చేస్తారని కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేకపాటి చంద్రశేఖర రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారని వైసీపీ ఎలా రుజువు చేస్తారని కోటంరెడ్డి ప్రశ్నించారు. ఇంక మున్ముందు ఏపీ రాజకీయాలలో ఎలాంటి ట్విస్ట్ లు నెలకొంటాయో చూడాలి.