కోటంరెడ్డి నమ్మకద్రోహి నారా లోకేశ్ సెటైర్లు ద్రోహం చేయొద్ద౦టూ సిఎం జగన్‌కు కేవీపీ లేఖ

1.రెండవరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
వైసీపీ – టిడిపి నేతల మధ్య కొనసాగుతున్న మాటల యుద్దం

2. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీరుపై అసెంబ్లీలో మంత్రి అంబటి రాంబాబు ఫైర్..
కోటంరెడ్డి నమ్మకద్రోహి.. చంద్రబాబు, టీడీపీ కోసం ఆయన పని చేస్తున్నారని నిప్పులు చెరిగిన అంబటి.

3. వైద్య, ఆరోగ్య శాఖలో 1,610 కొత్త పోస్టుల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..
గ్రామీణ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ కల్పించడం కోసం ప్రభుత్వం ఫ్యామిలి డాక్టర్ విధానం.

4.కేంద్రం ‘ఎత్తు’లకు తలొగ్గి రాష్ట్రానికి ద్రోహం చేయొద్దు..
పోలవరం ఎత్తును 140 అడుగులకు తగ్గించేందుకు కేంద్రం యత్నిస్తోంది.. ఎంత ఒత్తిడి తెచ్చినా అంగీకరించొద్దని సిఎం జగన్‌కు కేవీపీ లేఖ

5.టీడీపీ అంటే నాకు ఎక్స్ ట్రా ప్రేమేం లేదు..
ఆయన ఒకప్పుడు ముఖ్యమంత్రిగా చేశారు, సమర్థుడు కాబట్టి గౌరవిస్తున్నానని పవన్ కల్యాణ్ వ్యాఖ్య.

6.అండమాన్ నికోబార్ దీవుల్లో పోర్టుబ్లెయిర్ మున్సిపల్ చైర్ పర్సన్ గా టీడీపీ అభ్యర్థి గెలవడం పట్ల చంద్రబాబు హర్షం
టీడీపీ మహిళా నేత సెల్వి ఈ ఎన్నికల్లో విజయం

7.ఒక్క చాన్స్ అంటే నమ్మారు… ఏం జరిగిందో చూడండి..
తంబళ్లపల్లి నియోజకవర్గం పాదయాత్రలో సిఎం జగన్ పై నారా లోకేశ్ సెటైర్లు.

8.జంగారెడ్డిగూడెం కేకేఎం ఎర్రకాలువ జలాశయానికి మహర్దశ..
ఆధునికీకరణ పనులకు సంబంధించి ప్రతిపాదనలు చేయాలని ఉన్నతాధికారులకు జగన్ సర్కార్ ఆదేశ౦.

9.ప్లకార్డు చేతబట్టి పాదయాత్రగా అసెంబ్లీకి వైసిపి రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి..
నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమస్యలపై మాట్లాడేందుకు తనకు మైక్ ఇవ్వాలని స్పీకర్ ను కోరిన వైనం.

10.నేడు వైఎస్ వివేకానందరెడ్డి వర్థంతి..
నివాళులు అర్పించిన వైఎస్ సునీత. తన తండ్రిని ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని కన్నీటి పర్యంతం.