టీడీపీలోకి కోటంరెడ్డి రూట్ క్లియర్ చేస్తోన్న తమ్ముడు

ఎన్నికల వేళ జంపింగ్ లు షురూ అవుతున్నాయి. అయితే.. ఇటీవల రెబల్ గా మారిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరేందుకు రూట్ క్లియర్ అవుతోంది. తాజాగా జరుగుతున్న అసెంబ్లీలో సైతం కోటం రెడ్డి ప్రభుత్వంపై తమ నిరసన తెలిపారు. తన నియోజకవర్గానికి అభివృద్దికై నిధులు కేటాయించాలని ఫ్లకార్డులు చేత పట్టి.. తన నిరసన గళం వినిపించారు. ఇక అసెంబ్లీలో కూడా తనకు టిడిపి సభ్యులు తమ మద్దతు ప్రకటించారు. ఇక.. ఇప్పుడు టీడీపీలో ఎంట్రీ దిశగా తొలి అడుగు పడుతోంది. అయితే వైసీపీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన కోటంరెడ్డి గిరధర్ రెడ్డిని తాజాగా వైసీపీ నాయకత్వం సస్పెండ్ చేసింది. ఈయన ఈ నెల 24న చంద్రబాబు సమక్ష౦లో టిడిపి లో చేరబోతున్నారని వార్తలు తెగ ప్రచారం అవుతున్నాయి. ఇప్పుడు అన్నకు టీడీపీలో రూట్ క్లియర్ చేస్తూ తొలుత తాను ఎంట్రీ ఇస్తున్నారు.వైసీపీ ప్రభుత్వం పైన విమర్శలకు ముందే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరాలని నిర్ణయించారు. అప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబును కలిసినట్లు వైసీపీ నేతలు అప్పట్లోనే ఆరోపించారు. జిల్లా టీడీపీ నేతల నుంచి కోటంరెడ్డి పార్టీలో చేరిక పైన వ్యతిరేకత కనపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా స్వయంగా కోటంరెడ్డి వెల్లడించారు. దీని పైన చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పుకొచ్చారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీలోనే కొనసాగుతూ ధిక్కార స్వరం వినిపించేలా చూడాలనేది టీడీపీ వ్యూహం. ఇదే సమయంలో ఇప్పుడు రూరల్ లో పట్టు సాధించే క్రమంలో భాగంగా ముందుగా సోదరుడు గిరిధర్ రెడ్డి టీడీపీ కండువా కప్పుకుంటున్నారు. నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలతో సమావేశాలు..పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ఈ చేరిక ద్వారా అధికారికంగా అవకాశం దక్కుతుంది. శ్రీధర్ రెడ్డి మాత్రం మరి కొంత కాలం రెబల్ ఎమ్మెల్యేగానే కొనసాగనున్నట్లు కనిపిస్తోంది. ఇక అసెంబ్లీ సమావేశాల నుంచి కూడా కోటం రెడ్డిని సస్పెండ్ చేశారు. మరి కోటం రెడ్డికి టీడీపీలో ఛాన్స్ ఉంటుందో లేదో చూడాలి.