టీడీపీ రసిక రాజాల పార్టీ కీలక నేతకు జీవిత ఖైదు అడ్డంగా ఇరుక్కున లోకేష్

నారా లోకేశ్‌.. ఎదుటి వారిని విమర్శించే ముందు.. మన గురించి కూడా మనం ఒకసారి ఆలోచించాలి చినబాబు. వేలు ఎత్తి ఎదుటివాడిని నిందించే ముందు..ఆ మిగతా వేళ్ళు మన వైపు చూపుతున్నాయని జర గమనించాలి బాబు. పెదబాబు ఏదో స్క్రిప్ట్ ఇచ్చారని రాసిచ్చిన దానిని అలా ఉన్నది ఉన్నట్టు చదవటం రాజకీయ నాయకుడి లక్షణం కాదు లోకేష్. రాజకీయం అన్న తర్వాత కాస్త కళాపోషణ ఉండాలి. ఇక అసలు విషయానికొస్తే..
వైకాపా అంటే రసిక రాజాల పార్టీ అని మంత్రాలయం నియోజ‌క‌వ‌ర్గంలో పాదయాత్రలో లోకేష్ సెటైర్లు వేశారు. కాదు లోకేష్ అసలైన రసిక రాజాల పార్టీ అంటే టీడీపీనే. రాజకీయాల పేరు చెప్పుకొని అడ్డంగా ఎదిగేస్తా, తొక్కేస్తా, ఏదేదో చేస్తా అంటే అస్సలు కుదరదు లోకేష్. ఇప్పుడు సాగుతోంది ఆషామాషీ పాలన కాదు. సిఎం జగన్ పాలన. ఎవరికి అన్యాయం జరిగినా సహించేదే లే. వినోద్ కుమార్ జైన్‌ మీ టీడీపీ నేత కాదా..? వినోద్ కుమార్ జైన్‌ ఎలాంటి ఘనకార్యం చేశారో నీకు తెలియదా..? కామ్యంతో కళ్ళు మూసుకుపోయి.. బాలికపై లైంగిక వేధింపులు చేసింది మీ పార్టీ నేత కాదా..? ఇప్పుడు చెప్పు లోకేష్ రసిక రాజాల పార్టీ ఎవరిదో..? ఇప్పుడు చెప్పు లోకేష్ మహిళలకు ఏ పార్టీ నాయకుల నుంచి భద్రత లేదో..? తప్పు చేశాడు కాబట్టే.. జీవితకాల జైలు శిక్ష పడింది. గతేడాది భవానీపురంలో టీడీపీ నేత లైంగిక వేధింపులు తాళలేక అపార్ట్‌మెంట్ నుంచి దూకి బాలిక ఆత్మహత్య చేసుకుంది. స్థానిక లోటస్ లెజెండ్ అపార్ట్‌మెంట్‌లో బాలికను వినోద్ జైన్ వేధింపులకు గురిచేసినట్లుగా దర్యాప్తులో తేలింది. వేధింపులను ఎవరికి చెప్పుకోలేక బాలిక బలవన్మరణానికి పాల్పడింది. సూసైడ్‌ నోట్‌లో వినోద్ దారుణాలపై ప్రస్తావించింది. కాగా.. ఈ కేసుకు సంబందించి పోక్సో
కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సిఎం జగన్ చొరవతో ఈ కేసులో త్వరగా పురోగతి వచ్చిందని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.
వినోద్ జైన్‌కు యావజ్జీవకారాగార శిక్ష పడటం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి దుర్మార్గులకు జీవితకాల శిక్ష కాదు ఉరిశిక్ష పడాలన్నారు. తన కూతురి మరణానికి కారణమైన వినోద్ జైన్ కు ఇలాంటి శిక్ష పడినందుకు పైనున్న తన కూతురి ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు.