బాబును నమ్మిన పవన్ పతన౦ పురంధేశ్వరి క్లారిటీ మరో కొత్త డ్రామా అంటూ లోకేష్ విమర్శ

1.రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి మొదలైన పింఛన్ పంపిణీ…
తెల్లవారుఝాము నుంచే ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందిస్తున్న వలంటీర్లు.

2.నెల 3న cm జగన్ విజయనగరం, విశాఖ జిల్లాల పర్యటన..
విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన.

3.అడగ్గానే నిధులు ఇచ్చారు.. గుడివాడ బస్టాండ్‌కు జగన్ పేరే పెడతాం..
ఈ నెల 19న జగన్ చేతుల మీదుగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారని కొడాలి నాని స్పష్టం.

4.వచ్చే ఎన్నికల్లోనూ కొడాలి నానిదే గెలుపు…
గుడివాడ నియోజకవర్గ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడని కొనియాడిన పేర్ని నాని.

5.టీడీపీ మహానాడును అడ్డుకునేందుకే మా కుటుంబాన్ని టార్గెట్ చేశారు..
తన భర్త, మామలను ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కావడంలేదన్న ఆదిరెడ్డి భవానీ.

6.రజనీకాంత్‌పై వైసీపీ నీచపు వ్యాఖ్యలు.. జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే..
వైసీపీ ప్రభుత్వాన్ని రజనీ ఒక్క మాట కూడా అనలేదన్న చంద్రబాబు

7.చంద్రబాబును నమ్మి పవన్ కల్యాణ్ పతనమవుతున్నారు..
పవన్ కల్యాణ్ రాజకీయంగా దిగజారిపోతున్నాడని ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శ.

8.చంద్రబాబు, పవన్ భేటీపై నేనెందుకు స్పందించాలి..
బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి క్లారిటీ.

9.నాలుగేళ్లుగా స్పందనకు కాల్‌ చేస్తే స్పందనే లేదు…
ఇప్పుడు జగన్‌కు చెబుదాం.. అంటూ మరో కొత్త డ్రామా మొదలుపెట్టారంటూ లోకేష్ విమర్శలు.

10.సమ్మెకు సిద్ధమైన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం..
మా ఆగ్రహం ఎలా వుంటుందో బొత్సకు చూపిస్తామన్న అధ్యక్షుడు సూర్యనారాయణ.