రెచ్చిపోయి రెచ్చగొడుతున్న బాబు, పార్టీ నాశనానికి కారణం లోకేష్

ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు ఒక ఎత్తైతే.. 2024లో జరిగే ఎన్నికలో మరో ఎత్తనే చెప్పాలి. ఎందుకంటే.. ఈసారి జరిగే ఎన్నికల్లో ఏ పార్టీ ఒడిపోతే వారి పని అస్సాం అనే చెప్పాలి. ఈ నేపధ్యంలోనే.. సీఏం జగన్, చంద్రబాబు వ్యూహాత్మకoగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీలో ఎన్నికలకు సమయం ఆసన్నమయ్యింది.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్దంగా ఉండాలంటూ.. తమ పార్టీ క్యాడర్లకి పదే పదే స౦కేతాలిస్తున్నారు. అంటే.. ఏపీలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయం అంటూ బాబు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వంపై ఏదో ఒక ఆరోపణ చేయాలని, జగన్ పై ఏదో ఒక రకంగా బురద జల్లే పనిగా పెట్టుకున్న బాబు.. జగన్ చేతులెత్తిసి.. ముందస్తుకు వెల్లడం ఖాయం అని తమ రాజకీయ లబ్ది కోసం నానా పాట్లు పడుతున్నారు. దిగజారిన ఆర్ధిక పరిస్థితి వివేకా హత్య కేసులో జగన్ కుటుంబ పాత్ర, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల తిరుగుబాటు, లక్షల కోట్ల అప్పు తీర్చే మార్గం లేక జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నారని చంద్రబాబు భావిస్తున్నారు.

చంద్రబాబు, లోకేష్ సభలకు వస్తున్న ప్రజాదరణకు జడిసి ఓటమి భయంతో ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని విమర్శించారు. అసలు లోకేష్ పాదయాత్రకు జనాలు ఎక్కడ వస్తున్నారని వైసీపీ నాయకులు బాబుకు చురకలు అంటిస్తున్నారు. అందుకు కాదు.. మీ అచ్చన్న జనాలను తరలించడం కోసం బేరాలు మాట్లాడుకుంది, ఆ ఆడియో మీరు కూడా వింటే.. తెలుస్తుంది అసలు లోకేష్ పాదయాత్రకు జనాలు వస్తున్నారా లేదా.. తరలిస్తున్నారా అనేది. లోకేష్ పాదయాత్రకు ప్రజాదరణ లేదనే భయంతోనే చంద్రబాబు వణికిపోతున్నారని వైసీపీ నాయకులు సెటైర్లు వేస్తున్నారు. ఎన్ని జాకీలు పెట్టి లేపినా లోకేష్ లేచే పరిస్థితిలో లేరని వైసీపీ అంటున్న మాట. లోకేష్ నోటికొచ్చినట్టు మాట్లాడితే.. చూస్తూ ఊరుకోమని, లోకేష్ ఒకటి అంటే మేము నాలుగు అంటామని వైసీపీ గట్టిగానే రీటార్ట్ ఇస్తుంది. లోకేష్ మాట్లాడే మాటలు పార్టీ స్థితిని మరింత దిగజారుస్తున్నాయని, పార్టీ ఇంతలా దిగజారిపోవడానికి కారణం లోకేష్ అని అంటున్నారు. మరి ముందస్తు ఎన్నికలు వస్తాయని చెప్పుకుంటున్న చంద్రబాబు.. నిజంగానే ముందస్తు వస్తే.. ఎలా ఎదుర్కొంటారో చూడాలి.