1.చినబాబు ఫ్లాప్ షో..అందుకే చంద్రబాబు టాక్ షో..
రాజధాని గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదమని మంత్రి విడదల రజిని సెటైర్.
2.రాయలసీమ రైతుల గొంతు కోసింది చంద్రబాబే..
టీడీపీ హయాంలోనే కర్ణాటక అక్రమ ప్రాజెక్టులకు పునాది వేశారని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధ్వజం.
3.నేడు ‘వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా’..
బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం జగన్.
4.జగనన్న గోరుముద్ద మెనూలో మరో న్యూట్రియెంట్ ‘రాగిజావ’..
పిల్లలకు ఐరన్, కాల్షియం లోపాలు లేకుండా నివారించడానికి రాగిజావను చేరుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం.
5.నారా లోకేశ్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ అపశకునాలేనని, దుర్ఘటనలే..
లోకేశ్ పాదయాత్ర బలి యాత్రగా మారింద౦టూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ఎద్దేవా
6.జగన్ తో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ భేటీ..
కలిసి పనిచేద్దామని హామీ ఇచ్చిన అధినేత!
7.ఒంగోలులోని ఆంధ్రకేసరి యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా ప్రొఫెసర్ అంజిరెడ్డి మారెడ్డి..
ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ గవర్నర్
8.రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసే పోలీసులకు మంచి పోస్టింగ్ లు ఇస్తున్నారు..
యువగళం పాదయాత్ర సందర్భంగా పోలీసుల వైఖరిపై నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం
9.జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్…
పెద్దపప్పూరు ఇసుక రీచ్ వద్ద జేసీ నిరసన, నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వుతున్నారని ఆరోపణ.
10.ఏం నిబంధనలు అతిక్రమించాడని లోకేశ్ పాదయాత్రను అడ్డుకుంటున్నారు.
అందరినీ బెదిరించి చంపేస్తారా అంటూ చంద్రబాబు ఆగ్రహం