ఏపీలో ఆ పార్టీ గుర్తింపు రద్దు చంద్రబాబు పాపాల వల్లే ఈ భారం కోలుకోలేని దెబ్బకొట్టారన్న లోకేష్

1.అణగారిన వర్గాల కోసం జీవితాన్ని ధారబోసిన మహనీయుడు జ్యోతిరావు పూలే..
నేడు ఆయన జయంతి సందర్భంగా సీఎం జగన్ ట్వీట్.

2.’విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మా ప్రభుత్వం వ్యతిరేకం..
మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం.

3.ఏపీలో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ గుర్తింపు తొలగించిన కేంద్ర ఎన్నికల సంఘం.
2014, 2019 ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడంతో ఆ పార్టీ గుర్తింపు రద్దు

4.డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న చోట సమాంతరంగా మరో వాల్..
చంద్రబాబు పాపాల వల్లే ఈ భారం అంటున్న రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు.

5. ప్రభుత్వ గ్రాంట్తో నడిచే కాలేజీ కార్యకలాపాలు సక్రమంగా సాగనప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం తప్పు కాదు..
నర్సరావుపేటలోని ఎన్టీ అండ్ ఎన్వీసీ కాలేజీ టేకోవర్ ను సమర్ధించిన హైకోర్టు

6.మార్గదర్శి అక్రమ వ్యవహారాల కేసులో సీఐడీ కీలక నిర్ణయం..
చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహారాలను సమర్థిస్తూ లేఖలు రాస్తున్న వారికి నోటీసులు జారీ.

7.ఈనాడు అధినేత రామోజీరావు ముస్లిం, మైనార్టీలపై ఒలకబోస్తున్న ప్రేమాభిమానాలు మాకు అక్కర్లేదు..
బాబుకోసమే రామోజీ మత చిచ్చును రాజేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి ఎస్టి అంజద్ బాషా సంచలన వ్యాఖ్యలు.

8.పాదయాత్రలో లోకేశ్ ఆరోపణలపై స్పందించిన పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి..
చేసిన ఆరోపణలు రుజువు చేసుకోవాలని లోకేశ్‌కు సవాల్ .. నోరు అదుపులో లేకపోతే పరిస్థితి వేరేలా ఉంటుందంటూ వార్నింగ్.

9.పాలిచ్చే ఆవును వద్దని తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు..
టీడీపీ హయాంలో 34 శాతం ఉన్న రిజర్వేషన్లను జగన్ 10 శాతం తగ్గించి బీసీలను కోలుకోలేని దెబ్బకొట్టారంటూ లోకేష్ ఆరోపణ.

10. దళితులు, మైనార్టీల అభివృద్ధిపై చర్చకు రావాలంటూ మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు చాలెంజ్‌..
ఒక్కడే వచ్చిన సరే, చంద్రబాబును తెచ్చుకున్న సరే..నేను ఒక్కడినే వస్తా అంటూ ఛాలెంజ్‌కు సిద్ధం అంటూ మంత్రి మేరుగ స్పష్టం.