లోకేష్ ఫన్నీ స్పీచ్ దానికి కారణం మా నాన్నారే నవ్వులే నవ్వులు.. తూ.. తూ అంటూ

ఆయన మాట్లాడే తెలుగుపై ఇప్పటికే సోషల్ మీడియాలో సెటైర్లు చక్కర్లు కొడతాయి. బహిరంగ సభల్లో మాట్లాడుతూ.. పొరపాటున తమ పార్టీని తిట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. నేటి రాజకీయాలలో ఆయన ఓ కామిడీ పీస్. ఆయనెవరో ఇప్పటికే అర్ధమయ్యే ఉండాలి. ఆయనే నారా లోకేష్. తాజాగా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ట్రోలర్స్ కి అడ్డంగా దొరికిపోయాయి. ఆ వీడియోలను నెట్టింట షేర్ చేసి.. ట్రోల్స్ కూడా చేశారు. లోకేష్ యువగళం పాదయాత్ర మొదలు పెట్టి 60 రోజులు దాటినప్పటికీ.. లోకేష్ కి ఇంకా విషయ పరిజ్ఞానం రానట్టుంది. అందుకే ఏది పడితే అది మాట్లాడి.. నలుగురిలో పరువు పోగొట్టుకుంటున్నారు. అసలు లోకేష్ ఏమన్నాడో ఈ వీడియో వినేయండి.. మీకే అర్ధం అవుతుంది.

ఓరినాయన… ఏందయ్యా ఇది నేనెప్పుడూ వినలా…దామోదరం సంజీవయ్య గారు, నీలం సంజీవరెడ్డి గారు SK యూనివర్సిటీ లో చదివారా. ఏమి సెపితివి ఏమి సెపితివి .. మొదటి నుంచీ ఇంతేనా… ఈ మధ్యనే ఇలా అయ్యావా .. SK యూనివర్సిటీ పెట్టింది 1981 లో అంటే అప్పటికి ఇంకా నువ్వు పుట్టలేదురా నాయనా… దామోదరం సంజీవయ్య 1960-1962 మధ్యలో ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా, నీలం సంజీవరెడ్డి 1977 –1982 మధ్యలో మన దేశానికి రాష్ట్రపతిగా సేవలు అందించారు… అప్పటికి మీ నాయనే బచ్చాగాడు. కానీ నువ్వేమో దామోదరం సంజీవయ్య గారు, నీలం సంజీవరెడ్డి గారు SK యూనివర్సిటీలో చదివారని చెప్తున్నావు. ఓరినాయన ఇంకా నయం నీతో కలసి చదువుకున్నారు అనో.. లేక మీ నాయనతో కలసి కాఫీ తాగారనో చెప్పలా. తండ్రికి తగ్గ కొడుకువి అనిపించుకున్నావులే. మళ్ళీ ఇప్పుడేమో నాడు రైతులకు అభివృద్ది చేసింది మా నాన్నరే అని. అభివృద్దికి విత్తన౦ వేసింది చంద్రబాబేనని ఏవేవో మాట్లాడుతున్నారు. నాడు రైతులకు ఋణమాఫీ అని చెప్పిన చంద్రబాబు రైతులను మోసం చేశాడని నెటిజన్లు సీరియస్ అవుతున్నారు.