1.నేడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో సిఎం జగన్ పర్యటన..
మహిళల ఖాతాల్లోకి వైఎస్సార్ ఈబీసీ నేస్తం నగదు జమ.
2.ప్రభుత్వంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..
ఐదు ప్రత్యేక సాధారణ సెలవులను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ.
3.స్టీల్ ప్లాంట్‌పై జగన్ నిర్మాణాత్మక ప్రతిపాదన చేశారని.. ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని మోడీతో ఇదే అంశం మాట్లాడారు..
టీడీపీ నేతలకు పైత్యం ఎక్కువైందన్న సజ్జల.
4. మచిలీపట్నం పర్యటనను రద్దు చేసుకున్న చంద్రబాబు..
నేడు రోడ్ షో సందర్భంగా టిడ్కో ఇళ్ల పరిశీలన అంటూ టీడీపీ ప్రకటన.
5.తిరుమలలో కాటేజీల నిర్మాణానికి రికార్డు స్థాయిలో విరాళం ఇచ్చిన చెన్నై సంస్థ
25 కోట్ల డొనేషన్ ప్రకటించిన చెన్నైకి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ జీ స్క్వేర్.
6. ఏపీ వాసులకు అలెర్ట్..
రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ.
7.ఆ రక్త పిశాచాలు ఇప్పుడు వివేకా వ్యక్తిత్వంపైనా బురద జల్లుతున్నాయి..
గుండెపోటుతో మొదలైన డ్రామా ఇప్పుడు లైంగిక వేధింపుల వరకు వచ్చిందన్న టీడీపీ నేత బీటెక్ రవి.
8. అబ్బాయి కేతిరెడ్డి కేటు అయితే బాబాయ్ కేతిరెడ్డి దోపిడీలో సెప’రేటు’.
పెదపప్పూరు వద్ద పెన్నానదిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి అక్రమ ఇసుక తవ్వకాలను చూసిన యువనేత లోకేశ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు
9. చంద్రగిరిలో టీడీపీ ఇంచార్జి పులివర్తి నాని చేపట్టనున్న ‘‘మీ ఇంటివద్దకు మీ పులివర్తి నాని’’కి ఆంక్షలు
టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలు, జెండాలన్నింటినీ తొలగించిన పంచాయతీ అధికారులు.
10.తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ముస్లిం మైనారిటీలకు భద్రత లభించింది…
అరాచకానికి అడ్డుకట్ట వేసి వారు సామాజికంగా, ఆర్థికంగా ఎదగడానికి అవకాశాలు లభించాయన్న చంద్రబాబు.