నిన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీలో సమీక్ష జరుగుతుంది. క్రాస్ ఓటింగ్ కి పాల్పడిన ఆ ఇద్దరు ఎవరు అన్నదానిపై సస్పెన్స్ గా ఉంది. అయితే ఆ ఇద్దరూ ఎవరో తమకు తెలుసని సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా మీడియా ముఖంగా వెల్లడించారు. కానీ వారి పేర్లను ఇప్పుడే బయట పెట్టబోమని, సరైన సమయంలో వారిపై తగిన చర్యలు తీసుకుంటామని వైసీపీ అధిష్టానం చెప్తున్నమాట. అయితే ఆ ఇద్దరూ ఎవరు అన్న విషయాన్ని వైసిపి అధిష్టానం అధికారికంగా ప్రకటించలేదు. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యేలలో కొందర్ని అనుమానిస్తున్నారు. క్రాస్ వోటింగ్ కి పాల్పడినది వీరే అంటూ… వైసీపీలో చాలామంది పేర్లను అటు ప్రధాన మీడియోలను, ఇటు సోషల్ మీడియాలోనూ విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇక ఇదే క్రమంలో వసంత వెంకట కృష్ణ ప్రసాద్ స్పందించి నేను ఎలాంటి క్రాస్ ఓటింగ్ కి పాల్పడలేదని మీడియా ముఖంగా ఓ క్లారిటీ ఇచ్చారు. అయితే అనుమానితుల లిస్టులో ఉండవల్లి శ్రీదేవి పేరు కూడా మీడియాలో ప్రసారం అవడంతో.. రియాక్ట్ అయిన ఉండవల్లి శ్రీదేవి తాను ఎలాంటి క్రాస్ ఓటింగ్ పాల్పడలేదని.. క్లారిటీ ఇచ్చారు. అయితే ఆ ఇద్దరు ఎవరు అన్నది ఇప్పటివరకు సస్పెన్షన్ వీడలేదు. ఇక.. క్రాస్ వోటింగ్ కి పాల్పడిన వారిలో అనుమానిత జాబితాలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పేరు కూడా వినబడుతుంది.
ఇక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం ఆ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని కూడా తెలుస్తోంది. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. నిన్నటి నుంచి ఇప్పటివరకు ఆయన పేరు మీడియాలో ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆయన స్పందించకపోవడంపై ఆయనే ఈ తప్పు చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందని ప్రధాన న్యూస్ ఛానల్ లో ప్రచారం జరుగుతుంది. సో మరి సస్పెన్షన్ వీడాలంటే.. అసలు క్రాస్ వోటింగ్ కి పాల్పడిన వారు ఎవరో అన్నది.. వైసిపి అధిష్టానం బయట పెడితే తప్ప దోషులు ఎవరనేది తేలే పరిస్థితి లేదు ల.