ప్రసన్న కుమార్ రెడ్డికి మంత్రి పదవి..? కొడాలి నాని రీ ఎంట్రీ..!

తొందరలోనే మంత్రివర్గంలో మార్పులు ఉండనున్నాయని ఎప్పటినుండో జనాల్లో నానుతోంది. ఇక ఇదే విషయాన్ని ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు క్యాబినెట్ సమావేశంలో స్వయంగా సిఎం జగన్ చెప్పారు. ఎవరి పనితీరు మెరుగ్గా లేదో.. వారిని తప్పించి వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తామని కూడా సిఎం జగన్ ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను మంత్రుల సామర్ధ్యానికి పరీక్షగా కూడా చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు మూడు పట్టభద్రుల స్ధానాల్లోను వైసీపీ ఓడిపోయింది. దాంతో అభ్యర్ధుల గెలుపుకు ఎవరు పనిచేశారు ఎవరు పనిచేయలేదనే వివరాలను జగన్ ఫీడ్ బ్యాక్ తెప్పించుకున్నారని ప్రచారం సాగుతోంది. మరోవైపు.. ప్రజల్లోనూ ప్రస్తుత మంత్రులపై అవినీతి ఆరోపణలు పెల్లుబుకుతుండడంతో వచ్చే ఎన్నికల నాటికి.. పార్టీని ప్రభుత్వాన్ని సమాంతరంగా ముందుకు తీసుకువెళ్లాలని సీఎం భావిస్తున్నారు.
ఈ తరుణంలోనే సిఎం జగన్ ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే.. తనతో సహా మంత్రులు, ఎమ్మెల్యేల పని తీరు మెరుగ్గా ఉండాలనేది సిఎం అభిప్రాయం. అంతేకాదు తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను అంతే ధీటుగా తిప్పికొట్టే మంత్రులే.. ప్రస్తుతం పార్టీకి చాలా ముఖ్యం. అయితే ప్రస్తుతం ఉన్న మంత్రులలో నలుగురు పనితీరు అంతంత మాత్రంగానే ఉందని.. త్వరలో వారిని తప్పించి.. కొత్త వారికి అవకాశయం కల్పించనున్నట్లు పార్టీ వర్గాల్లో తెగ ప్రచారం అవుతోంది. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్రెడ్డికి కూడా.. సీఎం జగన్ మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతుండడం గమనార్హం. ఇటీవలే ఆయన పార్టీ మారుతున్నారన్న అనేక రకాల వార్తలు వచ్చాయి. వాటిని తిప్పికొట్టడంలో ప్రసన్న కుమార్ రెడ్డి సక్సస్ సాధించారు. ఇక నెల్లూరు జిల్లాలో ఇప్పటికే ముగ్గురు నాయకులు పార్టీకి దూరం అయ్యారు. నెల్లూరులో వైసీపీకి నెగటివ్ మార్క్ పోయి.. క్యాడర్ లో మళ్ళీ ఊపు రావాలంటే.. ఆ జిల్లా నుంచి ఆయననను మంత్రిగా నియామిస్తే లైన్ క్లియర్ అవుతుందని కూడా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు నెల్లూరులో రెబల్ ఎమ్మెల్యేల నుంచి వైసీపీకి ఇబ్బందులు ఎదురవకుండా ఉండాలంటే.. అక్కడ బలమైన నాయకుడికి మంత్రి పదవి అప్పగించాలని జగన్ సర్కార్ భావిస్తోందట. మరి చూడాలి చివరకు ఎం జరగబోతుందో అనేది.