లోకేష్ కి రాడ్ దించిన ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ దెబ్బకి ఫ్యూజులు ఔట్

లోకేష్.. నీ టెంటు దగ్గరకు వస్తా.. అక్కడే చర్చిద్దాం.. నేను చేసిన తప్పేంటి..? నేను చేసిన కబ్జాలు ఏంటి..? నోటికొచ్చినట్టు ఆరోపణలు చేయడం కాదు.. దమ్ముంటే నిరూపించు. ఆరోపణలను రుజువు చేస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా.అలా రుజువు చేయకపోతే నారా లోకేశ్ క్షమాపణ చెప్పాలి. అప్పుడే కర్నూలు దాటి వెళతావ్.. అంటూ.. లోకేష్ చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ స్పందించి గట్టి రాడ్ దించారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. ఎప్పటిలాగానే లోకేష్ స్థానిక ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు చేసారు. ఇందులో ముఖ్యంగా కబ్జా ఆరోపణలు ఉన్నాయి. హఫీజ్ ఖాన్ స్దానికంగా ఉన్న పలు స్ధలాల్ని ఆక్రమించుకుంటున్నట్లు లోకేష్ ఆరోపణలు చేశారు. అలానే తాము అధికారంలోకి వస్తే.. కర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేశామని లోకేష్ హామీ ఇచ్చారు. దీంతో స్థానిక కోర్టు వద్ద లాయర్లు రెండు వర్గాలుగా విడిపోయి.. ఒక వర్గం వారు టిడిపి కి మద్దతుగా ఒక వర్గం, వైసీపీకి మద్దతుగా మరొక వర్గం వారు నినాదాలు చేశారు. అయితే..లోకేష్ చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ స్పందించి గట్టి రాడ్ దించారు. తనపై చేసిన ఆరోపణలను రుజువు చేస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలి, అప్పుడే కర్నూలు దాటి వెళ్లాలని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ డిమాండ్ చేశారు. నీవు ఉన్న టెంటు దగ్గరకు వస్తా అక్కడే చర్చిద్దాం. నాపై ఆరోపణలు రుజువు చేయకపోతే నారా లోకేశ్ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. నాపై చేసిన ఆరోపణలపై నేను దేనికైనా సిద్ధమే. ఖురాన్ పట్టుకొని ఏ మసీదు దగ్గరుకైనా, దర్గా‌కైనా వస్తా. మీరు రమ్మంటే గౌరవంగా వస్తా. లేదంటే ఏదో సమయంలో వస్తా.. మీతో డిస్కస్ చేస్తానని హఫీజ్ ఖాన్ అన్నారు. మరి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చేసిన ఛాలెంజ్ ను లోకేష్ స్వీకరిస్తారో లేక.. మరిన్ని చిక్కులు కొని తెచ్చుకుంటారో చూడాలి.