బాలయ్యకు ఎమ్మెల్యే కేతిరెడ్డి కౌంటర్

ప్రపంచంలో మనిషి ఏదైనా గొప్పగా చేయగలిగింది ఉందంటే అది బాధ్యతగా ఉండటమే. వృత్తిలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, రాజకీయాలలో కావచ్చు. పూర్తిస్థాయి బాధ్యతగా ఉండటం అనేది చాలామంది విషయంలో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. బాధ్యత అనేది డిమండింగ్, కమండింగ్ ల మధ్య సాగేది కానే కాదు. అది మనిషిలో ఉండాల్సిన లక్షణాలలో ఒకటి. ప్రస్తుత రాజకీయాలలో అంత బాధ్యతగా ఉంటూ.. నిరంతరం ప్రజల్లోకి వెళుతూ.. ప్రజా సమస్యలను అక్కడికక్కడ పరిష్కరిస్తున్నారు.. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. ఈ ఎమ్మెల్యే చేసినట్టుగా మరే ఎమ్మెల్యే.. ఏ పెర్టీలోనూ ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదు. కోడికూత కూయగానే ప్రజల్లోకి వెళ్ళి వీధి వీధి తిరుగుతూ.. ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిస్కరిస్తున్నారు. ఇక ఈ నేపధ్యంలోనే.. Goodmorning- Dharmavaram” కార్యక్రమంలో భాగంగా ధర్మవరం పట్టణంలోని 36వ వార్డులో పర్యటిస్తున్న సమయంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఓ మహిళను అడిగారు. అందుకు ఆమె.. మాది హిందూపురం అని చెప్పింది. పోనీ అక్కడైనా ఏమైనా సమస్యలు ఉన్నాయా.. మీ బాలయ్య బాబు నాలాగా ఇంటింటికీ తిరుగుతుంటాడా అంటూ కౌంటర్ వేశారు. MLA కేతిరెడ్డి.