చెదిరిన చంద్రన్న కల లోకేష్ కి ఐడెంటిటీ తుస్ పెద్దబాంబ్ పేల్చిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి

ఏమిరా బాలరాజు.. నీ వల్ల ఉపయోగం.. అన్న డైలాగ్ నారా లోకేష్ కి ఇట్టే సెట్ అవుతుందనుకోండి. ప్రస్తుతం లోకేష్ చేస్తున్న పాదయాత్రకు జనాదరణ లేక, డబ్బులు ఇచ్చి జనాన్ని తరిలించలేక.. పాపం చంద్రన్న నానా అవస్థలు పడుతున్నారట. కొడుకు ఐడెంటిటీ కోసమే లోకేష్ చేత చంద్రబాబు ఈ పాదయాత్ర చేయిస్తున్నారట. యోగ్యుడు కాదు నా కొడుకు, ఇలా అయినా రాష్ట్రం అంతా తిరిగితే ఆలోచన ధోరణి అయినా మారుతుందని లోకేష్ ని రోడ్డుపైకి వదిలితే.. తీరా అతను చేసేది.. పోతూ పోతూ.. ఎమ్మెల్యేలను కార్యకర్తలను తిట్టుకుంటూ, బురద జల్లుతూ పోతున్నారు. మరి లోకేష్ ఇంత చేస్తుంటే.. వైసీపీ ఎమ్మెల్యేలు ఊరుకుంటారా.. అంటే అస్సలు ఊరుకోరు. ఈ క్రమంలోనే లోకేష్ పై, ఆయన పాదయాత్రపై.. తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసలు లోకేష్ చేస్తున్న పాదయాత్రకు ఓ అర్ధం పర్ధం ఉందా అంటూ ప్రశ్నించారు. పాదయాత్ర అంటే తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారో అని హామీలు ఇవ్వాలి. కానీ లోకేష్ కొత్తగా ఏమైనా హామీలు ఇస్తున్నారా..? అంటే లేదు. అసలు హామీలు అంటే ఏంటో కూడా తెలియని మూర్ఖుడు లోకేష్ అంటూ.. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గట్టిగానే ఇచ్చారు. గతంలో రాష్ట్ర ప్రజలను రాబందులా పీక్కు తిన్న చంద్రబాబు, ప్రజలకు చేసింది శూన్యం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని జనం నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. నేడు జగన ప్రభుత్వంలో రాష్ట ప్రజలు సంతోషంగా ఉన్నారని, తాము చేసింది ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తూ, గడపగడపకు తమ పాలనను చేరవేస్తున్నామని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ముక్తకంఠంగా చెప్పుకొచ్చారు. ఓ రాజకీయ నాయకుడు అంటే.. ప్రజలకు ఉపయోగపడే హామీలు ఇవ్వాలి గానీ.. ఇలా రెచ్చగొట్టుకుంటూ పోతూ.. ఇలా రౌడీ ఇజం చేస్తే.. చివరికి మీరు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోతుందని
ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వివరించారు. 12 కేసులో ఉన్న వారినే గుర్తిస్తానని చెప్పడం లోకేష్ మైండ్ లేని మాటలు మాట్లాడుతున్నారని, అసలు 11 కేసులు మించి ఉంటే.. వారిని రౌడీ సీటర్ అంటారని ఎమ్మెల్యే పెద్దారెడ్డి పెద్ద బాంబ్ పేల్చారు. ఒక రకంగా చెప్పుకోవాలంటే.. లోకేష్ పాదయాత్ర కంటే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పాదయాత్రకే జనం భారీగా మద్దతు ప్రకటిస్తున్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేస్తున్న సంక్షేమ పాదయాత్రకు తాడిపత్రిలో జనాధారణ లభిస్తుంది. జనం లేక లోకేష్ పాదయాత్ర చేదెక్కి౦దనే చెప్పాలి.