నువ్వు మగాడివైతే.. నిరూపించు ఎమ్మెల్యే పెద్దారెడ్డి సవాల్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి నుంచి పరార్

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆధిపత్య రాజకీయాలకు వేదికగా మారుతోంది. అనంతపురం జిల్లా రాజకీయాలను దశాబ్దాలుగా శాసిస్తున్న జేసీ, పరిటాల ఫ్యామిలీకి ప్రస్తుతం రాజకీయ భావిష్యత్ అంధకారంలోకి వెళ్ళిందనే చెప్పాలి. తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ల మధ్య వైరం మరింత ముదురుతోంది. తాడిపత్రిలో మళ్ళీ అధికారంలోకి రావాలని జేసీ ప్రభాకర్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తాడిపత్రిలో మళ్ళీ తమ జెండానే ఎగురుతుందని.. సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ముక్తకంఠంగా చెప్తున్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి.. తన నియోజకగవర్గం అంతటా విస్తృతంగా పర్యటిస్తున్నారు. పాదాయాత్ర చేస్తూ.. ప్రజలకు చేరువ అవుతూ.. ప్రజల కష్టాలను తెలుసుకొని.. అక్కడికక్కడే వారి సమస్యలను పరిష్కరిస్తూ.. జనాధారణ పొందుతున్నారు. ఇక ఈ నేపధ్యంలోనే.. తాజాగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. జేసీ ప్రభాకర్ రెడ్డికి కౌంటర్ వేశారు. జేసీ బ్రదర్స్ అరాచకాలకు సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని, ఫోర్జరీ డాక్యుమెంట్లతో 154 వాహనాలను జేసీ ట్రావెల్స్‌ అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించింది నిజం కాదా అని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నిలదీశారు. అన్ని అక్రమాలు చేసి.. అన్ని కేసులు ఆయనపై ఉంటే.. నాపై 73 కేసులు ఉన్నాయని ఆరోపిస్తున్నారు.. నువ్వు మగాడివైతే నాపై నమోదైన ఆ 73 కేసుల ఎఫ్ఫైఆర్ లను తీసుకొచ్చి నా ముందుంచు.. నేను తాడిపత్రి విడిచి వెళ్తా.. అదే కేసులు నీపై ఉన్నాయని నేను నిరూపిస్తా.. నువ్వు మగాడివైతే ఉరిడిచి వెళ్తావా అంటూ.. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దమ్మున్న సవాల్ విసిరారు. అమాయక ప్రజలు దొరికినారని, ఏది పడితే అది చెప్తే నమ్ముతారని, సింపతీ కోసం ఇలాంటి దొంగ రాజకీయాలు చేస్తున్నారని.. ఎమ్మెల్యే పెద్దారెడ్డి నిప్పులు చెరిగారు. తాడిపత్రిలో మీ పని అయిపోయిందని.. వచ్చే ఎన్నికల్లో మూట ముల్లె సర్దుకొని పోవాల్సిందే అంటూ..ఎమ్మెల్యే పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.