ఏపీలో ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ పెంచుతున్నాయి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి ఏడుగురు, టీడీపీ నుంచి ఒకరు బరిలో ఉన్నారు. అయితే ఏడుగురికి మాత్రమే నెగ్గే ఛాన్స్ ఉంది. టీడీపీకి నైతికంగా చూసుకుంటే 19 మంది సభ్యుల బలమే ఉంది. కానీ అభ్యర్థి నెగ్గాలి అంటే.. 22 ఓట్లు తప్పని సరి.. అంటే మరో మూడు ఓట్లు కావాలి.. ప్రస్తుతం వైసీపీకి రెబల్ గా మారిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, అనం రామనారాయణ రెడ్డి ఇద్దరు ఆత్మాప్రబోధాను సారమే ఓటు వేస్తామని చెప్పారు. దీంతో వారిద్దరి ఓట్లు టీడీకి పడుతుందని అంచనా వేస్తున్నారు. అది జరిగితే టీడీడీపి 21 ఓట్లు పడతాయి.. అయితే మరో సభ్యుడి మద్దతు అవసరం.. అయితే వైసీీపీ నుంచి భారీగా క్రాస్ ఓట్లు ఉంటాయని టీడీపీ నేతలు పదే పదే చెబుతున్నారు. దీంతో టీడీపీకి ఓటు వేసే ఆ వైసీపీ నేతలు ఎవరు అనే చర్చ జరుగుతోంది.
మరోవైపు ఇప్పటికే ఎన్నికల పోలింగ్ మొదలైంది. సీం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా హాజరై ఓట్లు వేస్తున్నారు. రెండు పార్టీలు విప్ జారీ చేసిన నేపథ్యంలో.. ఎవరైనా ఎన్నికకు డుమ్మా కొడతరా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.