ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. అమరావతిలోని వెలగపూడి అసెంబ్లీ ప్రాంగణంలో సిఎం జగన్ తో సహా.. ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఈ నేపధ్యంలోనే ఈ ఓటింగ్ క్రాస్ ఓటింగ్ మధ్య కొనసాగుతోంది. తమతో 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని.. తాజాగా అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో కలకలం రేపుతున్నాయి. సీఎం జగన్ పై అసంతృప్తిగా ఉన్న మూడు ప్రాంతాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు తమకు ఓటు వేయడం ఖాయమని వారు చెప్తున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. వైసిపి ఎమ్మెల్యేలు కూడా రాష్ట్రంలోని పరిస్థితులను చూస్తున్నారని… తమకు గౌరవం దక్కడంలేదని అంతర్మధనం చెందుతున్నారని అన్నారు. వారు కూడా ఆత్మ ప్రభోదానుసారం ఓటేసే అవకాశాలున్నాయి కాబట్టి మా గెలుగు ఖాయమని గట్టి నమ్మకంతో వున్నామని అచ్చెన్నాయుడు అన్నారు. మరి అచ్చెన్నాయుడు చెప్తున్న విధంగా ఆ 16 మంది ఎమ్మెల్యేలు ఎవరు..? ఇదంతా టిడిపి మైండ్ గేమ్ గా అనుకోవాలా.. లేక నిజంగానే అంతమంది సభ్యలు టిడిపి కి టచ్ లో ఉన్నారా..? అన్నదే ఇక్కడ అసలైన ప్రశ్న. అయితే.. దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే.. ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.