తన రాజకీయ అవసరాల కోసం అడ్డదారులు తొక్కే చంద్రబాబు.. పొత్తుల కోసం జిత్తులమారి వేషాలు వేస్తూ.. ఊసరివల్లిలా రంగులు మారుస్తూ.. రాజకీయాలను కథలు కథలుగా అల్లి.. తప్పు చేసింది తానే అయినా.. ఆ నిందలను ఈజీగా ఎదుటివారిపై నెట్టేయడం బాబు తర్వాతే ఎవరైనా. అధికారం కోసం చంద్రబాబు ఎంత నీచ స్థాయికైనా దిగజారుతారని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు. నాడు ప్రధాని మోడీని స్వయంగా నీ నోటితో నువ్వే తిట్టి .. నేడు అదే నోటితో మోడీని పొగుడుతున్నావా. నాడు మోడీని ఏమన్నావో మర్చిపోయావా బాబు. కుటుంబాన్ని సరిగా చూసుకోలేని వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు అని.. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు అసెంబ్లీ సమావేశంలో తమరు అనలేదా బాబు. మోదీ హార్డ్ కోర్ టెర్రరిస్ట్ అని 2019న చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన మైనారిటీల సభలో అనలేదా బాబు. ఇడ్లీ తిన్నా పన్ను కట్టించుకుంటున్నారని
2019న గుంటూరు సభలో అనలేదా బాబూ. బోఫోర్స్ కంటే అతిపెద్ద కుంభకోణం రాఫెల్ అని అనలేదా బాబు. ఇప్పుడు తాజాగా రిపబ్లిక్ టీవీ ఇంటర్వ్యూలో నాలుక మడతపెట్టి మోదీ అంత గొప్ప నాయకుడు లేరని.. మోదీ వల్లే దేశానికి గుర్తింపు వచ్చిందని, ఆయనే మా దేవుడు అని ఊసరివల్లిలా రంగులు మార్చడం ఏంటి బాబు. ప్రత్యేక హోదా కోసం పోరాడానే తప్ప మోదీని విమర్శించలేదట. అయ్యయ్యో.. రోజుకో వేషం.. పూటకో మాటతో.. ఇలా ప్రజలను ఇంకెంతకాలం మభ్యపెడతావు చంద్రబాబు. నీకు అనుకూలంగా ఉంటే పొగడ్తలు.. లేకుంటే విమర్శలు. రాజ్యాధికారం కోసం మరీ ఇంతలా దిగజారిపోవాలా చంద్రబాబు.. అంటూ బయట ప్రజలు తమరిపై ఉమ్మేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను ఢిల్లీకి పంపి పొత్తుకోసం జిత్తులమారి వేషాలు వేస్తున్నావా బాబు. ఇక నీ ఆటలు మోడీ సాగనివ్వడు బాబు. తమరి ఎత్తులకు పొత్తులు కూడరావు బాబు. మున్ముందు మోడీ కొట్టబోయే దెబ్బకి నీటి నుంచి జారీ బయటపడ్డ చేపలా గిలగిలా కొట్టుకోవడం ఖాయం.