కొండకు వెంట్రుక వేస్తే సరిపోతుందా.. ల్యాండ్ మైన్ పెడితేనే సరిపోతుంది. పాలిటిక్స్ లో బలమైన అభ్యర్ధిని ఢీ కొట్టాలంటే.. ప్రత్యర్ధి కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండాలి. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడం ప్రతిపక్షాల టార్గెట్ గా పెట్టుకున్నాయి. మరి అది అంత సులువైన రాజకీయమా..? మాటలు అంటే సరిపోతుందా..? రియాలిటీలో కూడా కనపడాలి కదా..? జగన్ వ్యతిరేక ఓటు చీలకూడద౦టూ పవన్ తెగ ఊగిపోతున్నారే తప్ప..
తమ రాజకీయ భవిష్యత్ కోసం ఎందుకు ఆలోచించట్లేదు..? చివరికి పవన్ ను తమ ఫ్యాన్స్ లోలోపల తిట్టుకుంటున్నారు. మరి కొందరైతే.. పవన్ చేసిన మోసానికి బహిరంగ౦గానే విమర్శలు చేస్తున్నారు. పార్టీ పెట్టింది ప్రశ్నించడం కోసమే అని ఒకసారి.. తాను ఎవరి పల్లకి మోయాల్సిన అవసరం లేదని మరొకసారి.. ఆఖరికి సిఎం రేసులోనే లేనని ఇంకోసారి.. ఇలా పవన్ డ్రామాలు చూస్తుంటే.. జనసైనికులకు నవ్వాలో.. ఏడవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీ పెట్టి ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా.. ఆ పార్టీకి సంబంధించిన పని చేసే నేతలకు సంబంధించి పట్టుమని పది పేర్లు చెప్పమంటే నోరెళ్ల బెట్టే పరిస్థితి. జనసేన తరుపున వచ్చే ఎన్నికల్లో ఎన్ని స్థానాలలో అభ్యర్ధులను భరిలోకి దించుతున్నారో క్లారిటీ లేదు. అసలు అంతెందుకు ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారో కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నారు.
ఆఖరికి రెండేళ్ల క్రితం పార్టీ పెట్టిన షర్మిళ కూడా తెలంగాణలో దాదాపు 43 స్థానాల్లో అభ్యర్ధులను బరిలోకి దించనున్నారు. మరి దీనిని బట్టే చెప్పవచ్చు.. అసలు పవన్ కళ్యాణ్ కి రాజకీయం మీద, ఆయన రాజకీయ భవిష్యత్ మీద ఎంత నమ్మకం ఉంది అనేది. సీన్ కట్ చేస్తే.. పొత్తులలో అసలు లెక్కలు సీట్లు కేటాయింపులోనే ఉన్నాయి. పొత్తుల లెక్కలు కొలిక్కి రాలేదు. ఈ తరుణంలోనే టీడీపీ నేతలు పలువురు.. ఎవరికి వారు తామే అభ్యర్థులమంటూ ప్రకటనలు ఇచ్చేసుకుంటున్నారు. ఇలాంటి వేళ.. పవన్ తో పొత్తులు పెట్టుకున్న వేళ పరిస్థితి ఏమిటి.? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇక అసలు విషయనికొస్తే.. జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నాదెండ్ల మనోహర్ కు టికెట్ ఇవ్వలేని స్థితిలో పవన్ ఉన్నారని ప్రచారం సాగుతోంది. 2019లో జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన అత్యంత ఘోరంగా ఓటమి పాలయ్యారు. టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి అలపాటి రాజేంద్రప్రసాద్ 17వేల ఓట్లతో ఓడారు. పొత్తుల్లో భాగంగా నాదెండ్ల కోసం తెనాలి టికెట్ ను చంద్రబాబు వదులుకోవటం సాధ్యమయ్యే పని కాదు.పోనీ సత్తెనపల్లి నుంచి కూడా టికెట్ దక్కే అవకాశం అస్సలు లేనే లేదు. ఎంపీగా పోటీ చేసేందుకు అనువైన పరిస్థితి లేదు. మొత్తానికి నాదెండ్లకు సీటు లేదన్న మాటాయితే.. తెగ ప్రచారం సాగుతోంది.