ఏపీలో పొత్తుల సంగతి ఏంటి..? ఏపీ రాజకీయాలపై పవన్ కి ఓ క్లారిటీ వచ్చిందా..? టిడిపితో కూడా కలుపుకుపోవాలని పవన్ బీజేపీ కి తేల్చి చెప్పేశారా..? అందుకే మోడీ, షా పవన్ కి అపాయింట్ మెంట్ ఇవ్వలేదా..? నాదెండ్ల వ్యాఖ్యల అనంతరం.. ఇవే ప్రశ్నలు ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో చక్కర్లు కొడుతున్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ గద్దె దించాలంటే.. ముందు జగన్ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదని.. పవన్ ఇప్పటికి పలుమార్లు ప్రస్తావించారు. ఈ క్రమంలోనే బీజేపీ టిడిపి పొత్తు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి ఈ కధ నడిపిస్తోంది చంద్రబాబేనని బయట ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే.. బీజేపీ అధిష్టానం ప్రస్తుతం బాబుతో దూరంగా జరిగింది. ప్రస్తుతం పవన్ మాత్రం బీజేపీతో స్నేహం చేస్తున్నారు. సో.. సిఎం జగన్ ను గద్దె దించాలంటే.. 2014 ఎన్నికల్లో వర్కౌట్ అయిన పొత్తుల సెంటిమెంట్ ని బాబు, పవన్ లు కలిసి మరొక్కసారి ట్రై చేద్దామని ప్లాన్ వేసినట్లుగా సమాచారం. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు తరుపున పవన్ ఢిల్లీ వెళ్ళి పొత్తుల డీల్ కోసం.. బీజేపీ పెద్దలతో సమావేశ0 అయ్యారని, కానీ అక్కడ అనుకున్నంత సానుకూలత కనబడలేదని అంటున్నారు. అందుకే రెండురోజుల పాటు మోడీ, షా లను కలవడం కోసం వెంపర్లాడారని అంటున్నారు. ఇక ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన నాదెండ్ల మనోహర్ మంగళగిరిలో ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీని కూడా కలుపుకుపోదాం అని బీజేపీ పెద్దలను కోరామని నాదెండ్ల పరోక్షంగా వెల్లడించారు. అయితే .. బీజేపీ మాత్రం టిడిపి వద్దు జనసేన ఒకే అన్నట్టుగా వ్యవహరిస్తోంది. కానీ పవన్ మాత్రం టిడిపి తోనే వచ్చే ఎన్నికల్లో కలిసి పొత్తులు పెట్టుకోవాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే.. ఏపీలో బీజేపీకి చెప్పుకోదగ్గ ఓట్ బ్యాంగ్ లేదు. ఈ అంశాన్ని బేస్ చేస్కొనో ఏమో.. దిల్లీలో పవన్ ఓ మాట అన్నారు. బీజేపీ ఇంకా బలపడాలని, ఆ పార్టీ కష్టపడితే మేలు అన్న రీతిలో వ్యవహరించారు. అయితే.. టిడిపి కన్నా జనసేనకు ఓట్ల శాతం చాలా తక్కువ. మరి అలా చూస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్ధి అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అలా అయితే.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా అన్నదే పెద్ద ప్రశ్న. మరి పొత్తుల విషయంలో పవన్, చంద్రబాబు ఎలాంటి డీల్ కుదుర్చుకుంటారో అన్నది ఏపీ రాజకీయాలలో ఉత్కంఠను రేపుతున్నాయి. అయితే.. 2014 ఎన్నికలకు ముందు పొత్తుల విషయంలో ఒక నెల రోజు ముందు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు జరగబోయే 2024 ఎన్నికలో కూడా ఎన్నికల సమయం దగ్గరకు వచ్చిన తర్వాతనే పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ మాట ఆల్రెడీ పవన్ స్వయంగా ప్రకటించారు. అయితే పొత్తుల విషయంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఏ స్థానాలు ఎవరికి కేటాయించాలన్న విషయం ముందుగానే నిర్ణయించాలి. లేదంటే.. వైసీపీకి ప్లస్ పాయింట్ అవుతుంది. సో.. పొత్తుల విషయంలో అతి త్వరలో తేల్చనున్నారని అంటున్నారు.