పక్కా ప్లాన్ తో సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకునే యత్నం హైకోర్టులో కేఏ పాల్ పిల్ రోజులు దగ్గరపడ్డాయన్న నాగబాబు

1.నేడు తిరుమల, తిరుపతిలో గవర్నర్ నజీర్ పర్యటన..
శ్రీవెంకేటేశ్వర వేద విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం కార్యక్రమానికి హాజరు.

2. విశాఖ ఉక్కుపై హైకోర్టులో కేఏ పాల్ పిల్..
నామమాత్రపు ధరకు విక్రయించకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కేఏ పాల్ పిల్ దాఖలు.

3.పోరంకిలో నేడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు..
హాజరు కానున్న సూపర్ స్టార్ రజనీకాంత్.

4.పక్కా ప్లాన్ తో సీఎం జగన్ కాన్వాయ్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు..
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి క్లారిటీ.

5.ఏపీలో రేషన్ కార్డు ఉన్నవాళ్లకు జగన్ సర్కార్ మరో గుడ్‌న్యూస్..
మే 1 నుంచి రాయలసీమ జిల్లాల్లో జొన్నలు, రాగులు పంపిణీ చేయనున్న ఏపీ ప్రభుత్వం.

6.చదవకుండానే ఆ సర్టిఫికెట్లు ఎలా వచ్చాయి?.. స్పీకర్ డిగ్రీ సర్టిఫికెట్‌తోపాటు ప్రొవిజనల్, మైగ్రేషన్, టీసీ సహా అన్నీ నకిలీవే..
స్పీకర్ తమ్మినేని సీతారాంపై నన్నూరి నర్సిరెడ్డి సంచలన ఆరోపణలు.

7.పవన్ కల్యాణ్ సుపరిపాలన అందిస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు..
విధ్వంస పాలన అందిస్తున్న వైసీపీకి రోజులు దగ్గరపడ్డాయని నాగబాబు విమర్శలు.

8.ఎన్ని చేసినా అమరావతి రాజధానిగా ఉంటుంది.. జగన్ మూడు ముక్కలాట సాగదు..
అమరావతి భూ స్కామ్ విచారణలో కొండను తవ్వి ఎలుకను కాదు.. ఎలుక బొచ్చు కూడా పట్టుకోలేకపోయారని చంద్రబాబు ఎద్దేవా .

9.ఎమ్మిగనూరు నియోజకవర్గంలోకి ప్రవేశించిన లోకేష్ పాదయాత్ర..
టీడీపీ ప్రభుత్వం రాగానే సమస్యలను పరిష్కరిస్తామని హామీలు.

10.స్పందన కార్యక్రమంపై సిఎం జగన్ సమీక్షా సమావేశం..
ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొననున్న జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు