ఆరు నూరైనా, నూరు ఆరైనా.. వచ్చే ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని టిడిపి , వైసీపీ సవాళ్ళకు ప్రతిసవాళ్ళు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే సిఎం జగన్, చంద్రబాబు ఎన్నికలకు సన్నద్ద అవుతున్నారు. అయితే.. గెలుపును ఛాలెంజింగ్ గా తీసుకున్న చంద్రబాబు.. విశ్రాంతి లేకుండా జిల్లాల టూర్ లు, నియోజకవర్గ సమావేశాలతో తెగ బిజీ అయ్యారు. ఈ క్రమంలోనే.. చంద్రబాబు ఆ మధ్య మూడు రోజుల కుప్పం టూర్ పెట్టుకున్నారు. కొత్త ఏడాది మొదట్లో చంద్రబాబు తన సొంత నియోజకవర్గానికి వెళ్తే పోలీసులు ఆయన ప్రచార రధాన్ని అడ్డుకున్నారు. పోలీస్ స్టేషన్ కి తరలించారు. బాబు టూర్ ని చేయకుండా అడ్డగించారు. దీంతో బాబు కుప్పం పర్యటన అంతా రచ్చ రచ్చ అయింది. జీవో నెంబర్ వన్ తో బాబు టూర్ లకు సీఏం జగన్ బ్రేకులు వేశారు. అప్పటి నుంచి బాబు టూర్లు అయితే లేవు. ఆ తర్వాత లోకేష్ పాదయాత్ర తెరపైకి వచ్చింది. అయితే లోకేష్ పాదయాత్రకు అనుకున్నంత ప్రజాదరణ లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట. లోకేష్ పాదయాత్రను మొత్తం తెర వెనక నుంచి డైరెక్ట్ చేస్తూ ఎప్పటికపుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త కొత్త సూచనలు చేస్తూ వస్తున్న చంద్రబాబు ఆ పనిలోనే బిజీగా ఉన్నారని అంటున్నారు.
ఎలుక తోక తెచ్చి ఎన్నినాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు.. అన్న చందంలో లోకేష్ మాటలకు ఆఖరికి సొంత పార్టీ నేతలు కూడా ఆకర్షితులు అవ్వకపోవడం విశేషంగా భావించాలి. లోకేష్ పాదయాత్రను నమ్ముకొని చంద్రబాబు నాలుగు గోడలకే పరిమితం అయితే.. నారా ఫ్యామిలీకి భవిష్యత్ ఉండదని.. రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు తాను ఈ సమయంలో పార్టీ ఆఫీసుకే పరిమితం కావాల్సి వస్తోంది అని అంటున్నారు. దీనికి కూడా ఓ బలమైన కారణం ఉందండోయ్. ఒకవేళ చంద్రబాబు కనుక జిల్లాల టూర్లు అంటూ.. రోడ్డెక్కితే.. మీడియా అటెన్షన్ అంతా బాబుగారిపైనే ఉంటుంది. అసలే లోకేష్ పాదయాత్రకు మీడియా అంతగా ఫోకస్ లేదని అందరూ అంటున్నమాట. లోకేష్ పాదయాత్రతో ముడిపెట్టి బాబు బ్రేకులేసుకుంటే మాత్రం కీలకమైన వేళ తెలుగుదేశం మంచి ఛాన్స్ ని మిస్ చేసుకున్నట్లే అని అంటున్నారు. మరి చూడాలి చంద్రబాబు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది.