ఆ కుంభకోణం సూత్రదారి నారా లోకేష్

1.గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం..
మంత్రులు, అధికారులను అభినందించిన సీఎం జగన్.

2.ఏపీలో మహిళలకే 90 శాతం సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి..పదవుల్లోనూ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇస్తుంది..
విజయవాడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో మంత్రి విడదల రజిని వ్యాఖ్యలు.

3.అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్..
మహిళలు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని ప్రశంసలు.

4.ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలకు తెర..
తాడిపత్రి టీడీపీ కార్యాలయంలో అధికారులు సోదాలు.. ఈ తనిఖీల్లో 5 లక్షలు స్వాధీనం.

5.విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరులో ఉద్రిక్తత..
ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన అధికారులపై తిరగబడ్డ మిరాకిల్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఉద్యోగులు

6.జనాల్లో మార్పు కనిపిస్తోంది…. జగన్ ఏం చేసినా ఓట్లు పడవు..
జగన్ బటన్ నొక్కడం వల్ల ప్రయోజనంలేదని సీపీఐ నారాయణ విమర్శ.

7.నారా లోకేశ్ పాదయాత్రలో వంగవీటి రాధా!
వారిద్దరూ నడుస్తూ పలు విషయాలపై చర్చ.

8.మంత్రులు, ఎమ్మెల్యేలకు 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నారు..
మరి ఉద్యోగులకు 1వ తేదీనే ఎందుకు జీతాలు వేయడం లేద౦టూ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బొప్పరాజు.

9.ముస్లిం ప్రతినిధులతో లోకేష్ ముఖాముఖి….
జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత మైనార్టీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారని జగన్ పాలనపై ఆగ్రహం

10.ఆ కుంభకోణం సూత్రదారి నారా లోకేష్.. జగన్‌తో పోలికా, నీ స్థాయి ఏంటి..
లోకేష్ పై వైసీపీ ఎంపీ భరత్ ఫైర్