అయిదుగురు పట్టంగ ముఫ్పై ఇద్దరు రుబ్బంగ ఒకడు తొయ్యంగ గుండువెళ్ళి గుండావతిలో పడింది.. అన్న చందాన ఉంది ప్రస్తుతం టిడిపి పరిస్థితి. పార్టీని గాడిలో పెట్టాలని బాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. లోకేష్ చేత పెద్ద సాహసమే చేస్తున్నారు. అసలే లోకేష్ పాదయాత్ర అంతంతమాత్రంగా ఉంటే.. ఆదిపత్య పోరుకోసం మధ్యలో తమ్ముళ్ల గోల అంతా ఇంతా కాదు. నంద్యాల నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా సొంత నాయకుల మధ్య ఫైటింగ్.. చద్రబాబుకి పిడిగుద్దులు అనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో చావో రేవో అన్న విధంగా పొలిటికల్ పోరు సాగుతుంటే.. ఇలా నేతలు ఓవర్ యాక్టింగ్ చేసి.. బాబుకి ఫిటింగ్ లు పెడుతున్నారు. అసలు ఏవీ సుబ్బారెడ్డి, భూమా అఖిలప్రియకి మధ్య ఇంతలా కక్ష్య పెరగడానికి కారణం ఏంటి..? ఒకే పార్టీలో ఉంటూ.. ఇలా ఫైటింగ్ చేస్కోనే అంత కష్టం ఎందుకు వచ్చింది..? వీరిరువురి మధ్య అంతకముందు నుంచే ఏమైనా వివాదాలు ఉన్నాయా..? ఆ వివాదాలే ఘర్షణకు దారి తీశాయా అంటే అవుననే సమాధానం వస్తుంది.
ఏవీ సుబ్బారెడ్డి వర్సెస్ భూమా అఖిలప్రియ తండ్రి భూమా నాగిరెడ్డికి ప్రాణ స్నేహితుడు. ఒక రకంగా చెప్పుకోవాలంటే భూమా నాగిరెడ్డి గెలుపులో ఆయన వెన్నంటే ఉండి ఏవి సుబ్బారెడ్డి ప్రతి విషయంలో ముందుండి వాళ్ళ కుటుంబానికి అండగా ఉన్నారు. భూమా నాగిరెడ్డి మృతి చెందిన తరువాత భూమా అఖిలప్రియకు ఏవి సుబ్బారెడ్డికి మధ్య ఆస్తి విషయంలో చిన్నపాటి మనస్పర్ధలు రావడంతో అవి కాస్త వాళ్ళ ఇద్దరి మధ్య వైరాన్ని పెంచాయి.గతంలో భూమా అఖిలప్రియ తమ తండ్రికి చెందినటువంటి ఆస్తులను అక్రమంగా ఏవి సుబ్బారెడ్డి కాజేసారంటు కోర్టును సైతం ఆశ్రయించిన సందర్బాలూ ఉన్నాయి. అప్పటినుండి వీళ్లిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా గొడవలు మొదలయ్యాయి. గతంలో వీరి పంచాయితీ ఏకంగా చంద్రబాబు వద్దకు కూడా వెళ్ళింది. వీరిద్దరినీ పిలిచి క్లాస్ పీకిన రోజులు కూడా ఉన్నాయి. అయితే.. ఆ విషయం అంతగా బయటకు రాలేదు. కానీ ఇప్పుడు ఆ గొడవలు శాస్త.. ఇవిగోండి ఇలా ఒకరినొకరు తన్నుకొనే పరిస్థితికి వచ్చిందంటేనే అర్ధం చేస్కోవాలి.. వారిరువురి మధ్య ఎంత వైరం ఉందో అనేది. మరి ఈ విషయంలో చంద్రబాబు కూడా సీరియస్ అయ్యారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి వీరికి చంద్రబాబు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారో చూడాలి.