ఏపీ రాజకీయాలలో గన్నవరం పేరు హాట్ టాపిక్ గా మారింది. గన్నవరంలో తాజాగా జరిగిన పరిణామాల నేపధ్యంలో రాజకీయ రణరంగాన్ని తలపిస్తోంది. అరెస్టులు.. ఆందోళనలతో పరిస్థితి అట్టుడికింది. తాజాగా టీడీపీ నేత పట్టాభిరాం అరెస్టుపై ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఈ నేపధ్యంలోనే.. పట్టాభి భార్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త ఆచూకీ లేదని, ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందని పట్టాభి భార్య చందన చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.
పట్టాభిని ఎవరు తీసుకెళ్ళారో తెలీదు. నాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అరగంట సమయంలో నా భర్త పట్టాభి ఎక్కడున్నాడో నాకు తెలియాలి. లేనిపక్షంలో డీజీపీ ఇంటి ముందు నిరాహారదీక్ష చేస్తా. నా కూతురు రాత్రి నుంచి నాన్న ఇంటికి రాలేదని భయపడుతోంది’’పట్టాభి భార్య అని తెలిపారు. గన్నవరంలో టిడిపి కార్యాలయం ధ్వంసం అయిన వార్తా వినగానే పట్టాభి అక్కడకి బయలుదేరారు. గన్నవరం బయలుదేరిన పట్టాభిరామ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఆ క్రమంలోనే ఆయనను అరెస్టు చేసి రహస్య ప్రదేశానికి తరలించారు. అలాగే గన్నవరం బయలుదేరిన మాజీ మంత్రి దేవినేని ఉమాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రస్తుతం పట్టాభిని తక్షణమే విడుదల చేయాలని ఆమె భార్య డిమాండ్ చేస్తున్నారు. మరి పట్టాభి అసలు ఎక్కడున్నారో తెలియాల్సి ఉంది.