ఉదాయాన్ని తెల్లవారే ముందు సూర్యుడు ఎలా అయితే వస్తాడో.. సరిగ్గా ఎన్నికలు వచ్చే ఏడాది సమయానికి వస్తాడు.. అతడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రస్తుత రాజకీయాలలో పవన్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో పెను దుమారం రేవుతున్నాయి. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలను
వీధి రౌడీతో పవన్ కళ్యాణ్ పోల్చడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పవన్ ఒక కౌంటర్ ఇస్తే వైసీపీ దానికి మించి డబుల్ కౌంటర్ లు ఇస్తూ.. పవన్ కి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. ఇక ఈ నేపధ్యంలోనే.. పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలపై కాపు నేత ముద్రగడ పద్మనాభం ఘాటుగా స్పందించారు. అంతేకాదు వారాహి యాత్రలో పవన్ చేస్తున్న పలు వ్యాఖ్యలకు ముద్రగడ కౌంటర్ ఇచ్చారు. తనకంటే బలవంతుడైన పవన్ కళ్యాణ్ ఉద్యమం చేపట్టి కాపులకు రిజర్వేషన్ ఎందుకు తీసుకురాలేకపోయారో చెప్పాలని ముద్రగడ డిమాండ్ చేశారు. గతంలో జగ్గంపేట సభలో అప్పటి విపక్ష నేత జగన్ కాపులకు రిజర్వేషన్ కేంద్రం చేతుల్లో ఉందని చెప్పినప్పుడు తానేం చెప్పానో గుర్తుచేసుకోవాలని పవన్ కు సూచించారు. కాపులకు 20 కోట్లు ఇస్తానన్నా వద్దన్నానని, బీసీల నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ ను, కాపుల నుంచి బొత్స సత్యనారాయణను సీఎం చేయమని అడిగినట్లు ముద్రగడ గుర్తుచేశారు. మరోవైపు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ చేసిన ఆరోపణల్ని ముద్రగడ పద్మనాభం తప్పుబట్టారు. దమ్ముంటే ఆయనపై పోటీ చేసి గెలవాలని సూచించారు. టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుంటానని చెబుతూ తనను సీఎం చేయమని ఎలా అడుగుతారన్నారు. పవన్ కళ్యాణ్ ని వీధి రౌడీలా పోల్చారు. ప్రస్తుత౦ ముద్రగడ చేసిన ఈ వ్యాఖ్యలు అటు జనసేన, ఇటు టిడిపి లో వణుకు పుట్టిస్తున్నాయి. ఉన్నట్టు౦డి.. ముద్రగడ పొలిటికల్ గా యాక్టివ్ అవడంతో, అది కూడా వైసీపీ కి సానుకూలంగా వ్యవహరి౦చడం ఇతర పార్టీ నేతలకి
టెన్షన్ పుట్టిస్తోందనే చెప్పాలి. ముద్రగడ పద్మనాభం ఆఫీషియల్ గా వైసీపీలో జాయిన్ అయితే.. ఇక టిడిపి , జనసేనలకి చిక్కు ఎదురవ్వక తప్పదని రాజకీయ నిపుణులు అంటున్నమాట. చూడాలి మరి పార్టీలో చెరికపై ఆయన తుది నిర్ణయం ఎలా ఉంటుందో అనేది.