1. నేడు గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సిఎం జగన్ భేటీ..
సాయంత్రం 5 గంటల సమయంలో వీరి సమావేశం.
2.గడపగడపకూ మన ప్రభుత్వంపై నేడు సిఎం జగన్ సమీక్ష..
ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు హాజరు.
3.జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా జూలై 1 నుంచి అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రత్యేక క్యాంపులు..
11 రకాల సేవలకు సర్విసు చార్జీలు ఉచితం.
4.మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీలో తవ్వినకొద్దీ బయటపడుతున్న అక్రమాలు..
ఆ కంపెనీకి చెందిన 23 చిట్ గ్రూపులను రద్దు చేసిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ.
5. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో వెల్లువెత్తుతున్న విద్యార్థుల చేరికలు..
ఆంగ్లమాధ్యమ విద్యతో అడ్మిషన్లకు భారీగా పెరిగిన డిమాండ్.. ఏ పాఠశాలలో చూసినా ‘నో వేకెన్సీ’ బోర్డులు.
6.కాపులంతా అందుకే పవన్ కల్యాణ్‌ను ఛీకొడుతున్నారు..
బాబు విదిల్చే కాసులకు పవన్ కల్యాణ్ కక్కుర్తు పడాలా? అని ప్రశ్నించిన మంత్రి జోగి రమేశ్.
7.అది జరగాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలవాలి..
వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడనివ్వకూడదనేదే తన ఉద్దేశం అని పవన్ కల్యాణ్ మరోమారు స్పష్టం.
8.జగన్ పాలనలో అన్ని రంగాల వారు బాధితులే..
పాదయాత్రలో తనను కలిస్తే సంక్షేమ పథకాలు కట్ చేస్తానని వాలంటీర్లు బెదిరిస్తున్నారని లోకేష్ వ్యాఖ్య.
9.వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వంగవీటి వీరాభిమాని..
రంగా బావమరిది చెన్నుపాటి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు.
10.కరకట్ట ఇల్లు జప్తుపై హైకోర్టుకు వెళ్లిన లింగమనేని..
కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించిన అత్యున్నత న్యాయస్థానం.