ఢిల్లీలో పవన్ డ్రామా..! తన్ని తరిమేసిన మోడీ కళ్యాణ్ బాబుకి ఏడుపు ఒకటే తక్కువ

పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన చివరకు ఆయనను అభాసుపాలు చేసిందా..? అసలు పవన్ కి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందా..? మరి అలాంటప్పుడు మోడీ, అమిత్ షా ఎందుకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు..? ప్రస్తుతం ఇవే ప్రశ్నలు రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారాయి. పవన్ ఢిల్లీ టూర్ పై జనసైనికులు గట్టి ఆశలే పెట్టుకున్నారు. కానీ నిన్నటి ఆయన ప్రసంగం బట్టి చూస్తే.. ఆయన మొహంలో ఏదో తేడా కొడుతుంది అని అంటున్నారు పబ్లిక్. ఢిల్లీ వెళ్లిన పవన్ ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కలవలేదు. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో మాత్రమే భేటీ అయ్యారు. అంతదూరం వెళ్ళిన పవన్ కి ప్రధానమంత్రి ఎందుకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు అనేదే ఇక్కడ అసలైన ప్రశ్న. పవన్ టీడీపీతో పొత్తుకు సిద్దమవుతున్న వేళ..బీజేపీని కూడా కలుపుకుని వెళ్లాలనే ఆలోచనతో చర్చల కోసమే ఢిల్లీకి వచ్చినట్లు సమాచారం. అందులో భాగంగా.. బీజేపీ-జనసేన- టీడీపీ కలిసి 2014 తరహాలో పోటీ చేయటం ద్వారా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా.. అధికారంలోకి రావటానికి మార్గం సుగమం అవుతుందని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని తాము పార్టీ నాయకత్వానికి నివేదిస్తామని మురళీథరన్ స్పష్టం చేసారని సమాచారం. జనసేన ఎజెండా – బీజేపీ ఎజెండా ఒక్కటేనని అంటున్నారే తప్ప.. అసలు విషయం పవన్ కళ్యాణ్ సూటిగా చెప్పలేకపోతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టిడిపి తో పొత్తు పెట్టుకోవడానికి బేజీపీని ఒప్పించడానికే పవన్ ఢిల్లీ వెళ్లారని విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ నాయకత్వం పవన్ కళ్యాణ్ ని పూర్తిగా నిరుత్సాహ పరచిందని, ఆయన ఢిల్లీ టూర్ ఏదో కంటి తుడుపుగానే ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట. ఆయన ప్రతిపాదనలను కూడా బీజేపీ అధిష్టానం పెద్దగా స్పందించలేదని విశ్లేషకులు అంటున్నారు. అక్కడ జరిగింది ఒకటి, పవన్ మీడియాకి చెప్పేది ఒకటని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సో.. చూడాలి మరి పవన్ మీడియా ముందుకు వచ్చి ఢిల్లీ టూర్ పై ఇంకెలాంటి ప్రకటనలు చేస్తారో అనేది.