1. ఉదయగిరిలో వేడెక్కిన రాజకీయం..
ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి సవాల్ ను స్వీకరించిన వైసీపీ నేత… ఉదయగిరి బస్టాండ్ సెంటర్ కు రావాలని మూలే వినయ్ రెడ్డి సవాల్.
2.ఏపీలో మరో నాలుగు రోజులు తేలికపాటి వర్షాలు..
దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడి.
3.విశాఖలో మూడోరోజు జీ-20 సదస్సులో సమగ్ర చర్చ…
భవిష్యత్తులో స్థిరమైన ఆర్థిక నగరాల నిర్మాణంపై తమతమ వ్యూహాలను సమర్పించిన జీ-20 దేశాల ప్రతినిధులు.
4.ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నేడు బంద్ కు పిలుపునిచ్చిన ఆదివాసీలు..
బోయ, వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏజెన్సీ బంద్ కు పిలుపు.
5.ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు సిగ్గులేకుండా చంద్రబాబు వెనుక తిరుగుతున్నారు..
చంద్రబాబు కనుసన్నల్లోనే అమరావతి రైతుల యాత్ర కొనసాగిందని కొడాలి నాని ఆరోపణ.
6.ఎండలు మండిపోతున్నా.. పిల్లలకు ఒంటిపూట బడులు ఎందుకు పెట్టడం లేదు?
ఉపాధ్యాయులను సాధించడానికి పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్న అనగాని సత్యప్రసాద్.
7.ప్రజలు టీడీపీని ఎందుకు తిరస్కరించారని చాలా బాధపడ్డా..
చంద్రబాబు విజనరీ అని, విజనరీకి మారుపేరు చంద్రబాబు అని గూగుల్ లో వస్తుందని నారా లోకేశ్ వ్యాఖ్య.
8.ఏపీలో మరో విద్యుత్ ఉద్యమానికి ఆస్కారమివ్వకండి..
ప్రజారంజక పాలనంటే పదేపదే విద్యుత్ భారాలు ప్రజలపై మోపటమేనా అంటూ సిఎం జగన్ కి సీపీఐ నేత రామకృష్ణ లేఖ.
9.వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా వైసీపీ ప్రభుత్వంలో చలనం లేదు..
త్వరలోనే రైతుల కష్టాలపై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్న పవన్ కల్యాణ్
10.పరిటాల సునీత మంత్రిగా ఉన్న సమయంలో అనంతపురం రూరల్ పరిధిలో భారీ భూ కుంభకోణం జరిగింది..
కోట్లు విలువ చేసే భూములు ఆమెకు అనుకూలంగా ఉన్న వారికి రాసిచ్చారని రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి ఆరోపణ.