1.బీసీల అభ్యున్నతి కోసం సీఎం జగన్ కృషి..
గుంటూరులో బీపీ మండల్ విగ్రహావిష్కరణ, బీసీల ఆత్మగౌరవ సభలో మంత్రి రజిని వ్యాఖ్య.
2.నర్సింగ్ ఏపీ టాప్..
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడి.
3.నేడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సీఎం జగన్ భేటీ..
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం ప్రారంభ౦.
4.మంత్రి రోజా నియోజకవర్గంలోకి ప్రవేశించిన లోకేశ్ పాదయాత్ర..
లోకేశ్ కు ఘనస్వాగతం పలికిన నగరి నియోజకవర్గ ప్రజలు.
5.ఏపీలోని గ్రామాల్లో రీసైక్లింగ్ రోడ్లు..
సేకరించే ప్లాస్టిక్ చెత్తతో రహదారులు
6.పోలీసు శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీని అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నాం..
ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసేవారిని నమ్మవద్దని హోం మంత్రి తానేటి వనిత వెల్లడి.
7.పోలీసు అధికారులు ప్రైవేటు సైన్యంలా తయారయ్యారన్న గోపాలగౌడ
జస్టిస్ గోపాలగౌడ వ్యాఖ్యలను అధికారులు సీరియస్ గా తీసుకోవాలని పవన్ కల్యాణ్ వ్యాఖ్య.
8.కాపులకు జరిగిన అన్యాయం ఈ దేశంలో మరెవరికీ జరగలేదు..
కాపులకు వైసీపీ, టీడీపీ రెండూ చేసిందేమీ లేదన్న జీవీఎల్ నరసింహారావు
9.క్రమార్జనలో సఫలమైన మంత్రి… రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురావడంలో విఫలమయ్యారు..
అవినీతి పెరిగిపోవడంతో ఆయనను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జీ పదవి నుంచి జగన్ తప్పించారని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర ఆరోపణ.
10.నా పాదయాత్రను అడ్డుకోవడానికి, నా నుంచి మైకు లాక్కోవడానికి పోలీసులకు టార్గెట్లు విధించారు.
అసలు నేనంటే ఎందుకంత భయం జగన్‌రెడ్డీ’అంటూ నారా లోకేశ్ ప్రశ్న.