బిఆర్ఎస్ పార్టీని భారతదేశ నలుమూలలా విస్తరింపజేయాలని ఆ పార్టీ నాయకులు ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఆ పార్టీకి చెందిన నేతలు ఏపీ రాజకీయాలలో తలదూరుస్తూ. అయితే.. ఇప్పుడు తాజాగా బీఆర్ ఎస్ నాయకులు ఏపీ రాజకీయాలను టార్గెట్ చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు.. తెలంగాణ మంత్రులకు, బిఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేయడానికి ఆయుధంగా మారాయి. పవన్ కళ్యాణ్ పదేపదే కుల ప్రస్తావ తీసుకురావడమే ఇందుకు నిదర్శనం అని చెప్పాలి. ఎందుకంటే పవన్ తప్ప కులాల గురించి ఏపీలో మరే ఇతర రాజకీయ నాయకుడు ఆ ప్రస్తావన తీసుకురాలేదు. ఏపీలో కుల రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయని, కుల పిచ్చి తోనే ఏపీ అభివృద్ధి శూన్యంగా మారుతుందని తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఏపీ అభివృద్దిపాయి కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అభివృద్ధి, సంక్షేమం అడ్రస్ లేకుండా పోయాయని చెప్పుకొచ్చారు. ఏపీకి ఇంకా రాజధాని నిర్ణయం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లేకుండా మిగిలిపోవడానికి కారణం కుల రాజకీయాలేనంటూ వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ పై ఎవరెన్ని కుట్రలు చేసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఆర్ఎస్ విస్తరణను ఎవరూ ఆపలేరని తేల్చి చెప్పారు. అయితే.. బిఆర్ఎస్ పార్టీ ఏపీకి వస్తే తాను మనస్పూర్తిగా ఆహ్వానిస్తానని తాజాగా జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా ఏపీ రాజకీయాలపై తెలంగాణ రాజకీయ నేతలు నోరుజారి.. అనేక ఇబ్బందుల్లో పడ్డారు. మరి ఇప్పుడు ఏపీ రాజకీయాలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఏపీ రాజకీయ నేతలు ఎలా రియాక్టి అవుతారో చూడాలి.