పెద్ద బాంబ్ పేల్చిన పవన్..! టీడీపీ నేతల్లో టెన్షన్

వచ్చే ఎన్నికల యుద్దానికి ఆయా రాజకీయ పార్టీలు సన్నద్ధమయ్యాయి. సిఎం జగన టార్గెట్ గా ఏపీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఏకమయ్యేందుకు వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నారు. అయినప్పటికీ.. తోడేళ్ల గుంపు ఏకమైనా తాను మాత్రం ఒంటరిగానే ఎన్నికల భరిలోకి దిగుతానని సిఎం జగన్ కుండ బద్దలు కొట్టి మరీ చెప్పారు. తాము 175 నియోజకవర్గాలలో తమ అభ్యర్ధులను భరిలోకి దించుతున్నాం.. 175లో అభ్యర్ధులను నిలబెట్టే దమ్ము మీకుందా అంటూ సిఎం జగన్ చేసిన సవాల్ ను టిడిపి, జనసేన ఒక ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి – జనసేన పొత్తులు అయితే ఖాయం అని తెలుస్తోంది. బీజేపీని కూడా ఒప్పించి పొత్తులోకి తీసుకొస్తానని పవన్ చెప్పకనే చెప్పారు. అయితే అసలైన ముడి సీట్ల పంపకంలోనే ఉందనే చెప్పాలి. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో తమకు 40 నుంచి 50 వరకు ఎమ్మెల్యే స్థానాలు కావాలని పవన్ డిమాండ్ చేస్తున్నారట. దీంతో తమ్ముళ్ళల్లో టెన్షన్ మరింత పెరిగిపోతోంది. ఎందుకంటే తమకు బలమున్న ప్రాంతాల్లో కచ్చితంగా పోటీచేస్తామని పవన్ చేసిన ప్రకటనే టీడీపీ నేతల్లో టెన్షన్ కు కారణమైంది.పవన్ లెక్కప్రకారం ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా నుండి శ్రీకాకుళం జిల్లా వరకు పార్టీకి మంచి పట్టుందట. 2019లో వచ్చిన 7 శాతం ఓటుబ్యాంకుతో పోల్చుకుంటే ఇపుడు తమ పార్టీ ఓటుబ్యాంకు బాగా పెరిగిందని జనసేన పార్టీ నేతలు ప్రచారం చేసుకు౦టున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న డిమాండ్ కు చంద్రబాబు మౌనంగా ఉన్నారని అంటున్నారు. మరో వైపు తెలుగు తమ్ముళ్ళు పార్టీ కోసం కష్టపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వారికి అవకాశం దక్కుతుంది అన్న ఆశతో పార్టీ కోసం కృషి చేస్తున్నారు. ఇక ఈ పొత్తులు ఉంటాయని క్లారిటీ రాగానే కొందరి తమ్ముళ్లలో టెన్షన్ పెరిగిందని అంటున్నారు. అందుకే కాబోలు కొందరు తమ్ముళ్ళు అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారట. కష్టం తమది.. ఫలితం వేరొకరిదా అన్న పందాన వారు ఉన్నారట. అయితే తాము అధికారంలోకి వస్తే.. ఏదో ఒక పోస్టులు కట్టబెడతామని చంద్రబాబు బుజ్జగిస్తున్నారట. మరి బాబు బుజ్జగింపులకు చిన్నపాటి నాయకులు అయితే ఒకే.. కానీ సీనియర్లు లొంగుతారా అనేదే ఇక్కడ అసలైన ప్రశ్న. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా గానీ.. చాలా వరకు నియోజకవర్గాలలో టిడిపి కి ఇంచార్జ్ లే లేరు. మరి చివరికి ఈ పొత్తుల గోల తమ్ముళ్లలో ఎవరికి తలనొప్పిగా మారనుందో అనేది చూడాలి.